1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 8 ఆగస్టు 2023 (19:59 IST)

ఇద్దరు బిడ్డల తల్లితో పెళ్లి.. కుమార్తెను గర్భవతిని చేసిన కామాంధుడు

marriage
తమిళనాడుకు చెందిన 25 యేళ్ల యువకుడు ఒకడు ఇద్దరు బిడ్డల తల్లిని రెండో పెళ్లి చేసుకున్నాడు. ఒకవైపు భార్యతో కాపురం చేస్తూనే.. ఆమె మొదటి భర్తకు పుట్టిన కుమార్తెల్లో చిన్న కుమార్తెను గర్భవతిని చేశాడు. అంటే వరుసకు కుమార్తె అయ్యే అవతుని తన మాయమాటలతో లోబరుచుకుని శృంగారంలో పాల్గొని గర్భవతిని చేశాడు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని సేలం జిల్లాలో వెలుగు చూసింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
కన్నియాకుమారి జిల్లా ఇరుళ్పురం అనే గ్రామానికి చెందిన విశ్వ (25) అనే యువకుడు గత 2022లో కృష్ణగిరిలోని ఒక వస్త్ర దుకాణంలో పనిచేస్తూ వచ్చాడు. ఆ సమయంలో తనతో పాటు పని చేసే ఓ మహిళతో పరిచయం పెంచుకున్నాడు. ఆ తర్వాత ఆమెను ప్రేమిస్తున్నట్టుగా చెప్పి, పెళ్లి చేసుకున్నాడు. కొంతకాలం తర్వాత ఆమెను వదిలివేసిన విశ్వ.. అదేప్రాంతంలోని ఒక జ్యూస్ షాపులో పనికి చేరాడు. ఆ దుకాణానికి వచ్చే భర్త చనిపోయిన 40 యేళ్ళ మహిళను తన మాయమాటలతో లోబరుచుకున్నాడు. ఈమెకు మొదటి భర్త ద్వారా కలిగిన ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు. 
 
ఆ తర్వాత ఆమెను పెళ్ళి చేసుకున్న విశ్వ.. తన మకాంను సేలంకు మార్చాడు. సేలం, అంబాపేట, జ్యోతి థియేటర్ సమీపంలో ఒక ఇంటిని అద్దెకు తీసుకుని అక్కడ ఉండసాగాడు. అదేసమయంలో పొరుగింటి మహిళతో విశ్వకు పరిచయం ఏర్పడటం, ఆమెను కూడా లోబరుచుకోవడం జరిగింది. ఈ విషయం రెండో భార్యకు తెలిసింది. దీంతో రెండో భార్య, ఆమె ఇద్దరు కుమార్తెలు, అక్రమ సంబంధం పెట్టుకున్న మూడో మహిళ .. వీరంతా కలిసి ఒకే ఇంటిలో ఉంటూ వచ్చారు. 
 
కొద్ది రోజుల తర్వాత రెండో భార్య, ఆమె ఇద్దరు కుమార్తెలను మరో వీధిలో ఇంటిని అద్దెకు తీసుకుని అక్కడకు మకాం పెట్టాడు. ఆ ఇంటికి వెళ్ళి వచ్చే క్రమంలో రెండో భార్య రెండో కుమార్తెను మాయమాటలు చెప్పి లోబరుచుకుని, గర్భవతిని చేశాడు. ఈ విషయం తెలుసుకున్న ఆ బాలిక బంధువులు అంబాపేట మహిళా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విశ్వను పోలీసులు అరెస్టు చేసి విచారించగా అతని బండారం బయటపడింది. అలాగే, ఇంకెంతమందిని విశ్వ మోసం చేశాడన్న విషయంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.