సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 3 ఆగస్టు 2023 (18:00 IST)

ఇటుక బట్టీ వద్ద కాలిన బాలిక శవం.. ఎక్కడ?

deadbody
రాజస్థాన్ రాష్ట్రంలో ఓ బాలిక కాలిన శవం వెలుగు చూసింది. ఇంటి నుంచి అదృశ్యమైన కొన్ని గంటల్లోనే ఆ బాలిక మృత్యువాతపడటం గమనార్హం. తాజాగా వెలుగు చూసిన ఈ దారుణ ఘటన వివరాలను పరిశీలిస్తే, బుధవారం భిల్వారా గ్రామానికి మృతురాలు తన తల్లితో కలిసి మేకలు మేపుకునేందుకు ఇంటి నుంచి బయలుదేరింది. ఆ తర్వాత ఆ బాలిక తల్లికి కనిపించకుండా పోయింది. ఎంతసేపటికి ఇంటికి తిరిగిరాలేదు. 
 
దీంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఆమె కోసం రాత్రంతా గాలించారు. గురువారం తెల్లవారుజామున ఆమె ఇంటికి సమీపంలోని ఇటుక బట్టీ వద్ద పోలీసులు కాలుతున్న దేహాన్ని, వెండిపట్టీ, చెప్పులను గుర్తించారు. వాటి ఆధారంగా ఆ మృతదేహం బాలికదే అని భావిస్తున్నారు.
 
హత్యకుముందు ఆమెపై సామూహిక అత్యాచారం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అలాగే ఘటనా స్థలంలోని ముగ్గురు అనుమానితులను అరెస్టు చేశారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. తక్షణమే న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. తమ ఫిర్యాదుపై పోలీసులు వెంటనే స్పందించలేదని, ఐడీ, జనన ధ్రువీకరణ పత్రం అడిగారని ఆరోపించారు.