సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 2 ఆగస్టు 2023 (20:30 IST)

మద్యం తాపించి.. అమెరికా మహిళపై అత్యాచారం... ఎక్కడ?

victim
భారతదేశంలోని పర్యాటక అందాలు తిలకించేందుకు వచ్చిన అమెరికా మహిళ అత్యాచారానికి గురైంది. ఈ ఘటన కేరళ రాష్ట్రంలో జరిగింది. ఆ మహిళకు మద్యం తాపించి మరీ లైంగిక దాడికి పాల్పడ్డారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
 
అమెరికాకు చెందిన 44 యేళ్ల మహిళ గత నల 22వ తేదీన భారత్‌కు వచ్చారు. ఆమె కేరళ రాష్ట్రంలోని కొల్లమ్ జిల్లాలోని ఓ ఆశ్రమంలో బస చేస్తుంది. గత నెల 31వ తేదీన ఆశ్రమానికి సమీపంలోని బీచ్‌లో ఒంటరిగా ఉన్న సమయంలో ఇద్దరు వ్యక్తులు ఆమెను సమీపంచి, సిగరెట్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆమె తిరస్కరించడంతో మద్యాన్ని తాపించారు. దీంతో ఆమె మత్తులోకి జారుకుంది.
 
ఇదే అదునుగా భావించిన ఇద్దరు వ్యక్తులు ఆమెను బైకుపై మరో ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. మరుసటిరోజు బాధితురాలు కరునగపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఈ ఘటనకు పాల్పడిన నిఖిల్, జయన్‌ అనే ఇద్దరిని అరెస్టు చేశారు. వారిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.