సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : గురువారం, 6 సెప్టెంబరు 2018 (10:13 IST)

శివమొగ్గ మేయర్‌గా ఆటో డ్రైవర్ సతీమణి.. అదృష్టం అలా వరించింది...

కర్ణాటకలోని శివమొగ్గకు చెందిన బీజేపీ కార్యకర్త గణేశ్ సతీమణికి అదృష్టం వరించింది. ఇటీవల జరిగిన నగర మున్సిపాలిటీ ఎన్నికల్లో గణేశ్ ఉండే ప్రాంతం మహిళలకు రిజర్వ్ అయ్యింది. దీంతో తన భార్య లతను ఎన్నికల బరిలో

కర్ణాటకలోని శివమొగ్గకు చెందిన బీజేపీ కార్యకర్త గణేశ్ సతీమణికి అదృష్టం వరించింది. ఇటీవల జరిగిన నగర మున్సిపాలిటీ ఎన్నికల్లో గణేశ్ ఉండే ప్రాంతం మహిళలకు రిజర్వ్ అయ్యింది. దీంతో తన భార్య లతను ఎన్నికల బరిలోకి దించాడు. 
 
ఎన్నికల ఖర్చును పార్టీ ముఖ్య నేతలే భరించడంతో ఆర్థిక భారం గణేశ్‌పై పడలేదు. ఈ ఎన్నికల్లో లత కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. 20 స్థానాలు సాధించిన బీజేపీ శివమొగ్గలో తిరుగులేని మెజారిటీ సాధించింది. దీనికి తోడు అదృష్టం వరించింది. 
 
శివమొగ్గ మేయర్ స్థానం ఎస్సీ మహిళకు రిజర్వు కావడం, పార్టీలో లత తప్ప మరెవరూ ఎస్సీ మహిళ లేకపోవడంతో మేయర్ పదవికి ఆమె అర్హురాలైంది. అందరూ కలిసి ఆమెను మేయర్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తన భార్య లత మేయర్‌గా ఎన్నిక కావడంపై గణేశ్ హర్షం వ్యక్తం చేశారు. పార్టీ కోసం రెండు దశాబ్దాలుగా పనిచేస్తున్న తమ కుటుంబానికి దక్కిన గౌరవం ఇదని గణేశ్ వ్యాఖ్యానించాడు.