సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 14 ఆగస్టు 2022 (13:46 IST)

మహారాష్ట్ర బీడ్ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఆరుగురు దుర్మరణం

road accident
మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం ఉదయం 5.30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. 
 
మంజార్ సంబా - పటోడా జాతీయ రహదారిపై కారు, డీసీఎం వ్యాను ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదంలో కారు డీసీఎం వ్యాను కింది భాగానికి దూసుకొని వెళ్ళడంతో కారు నుజ్జునుజ్జు అయింది. 
 
ఈ ప్రమాద వార్త తెలుసుకున్న వెంటనే పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక  చర్యలు చేపట్టారు. ఈ మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఉన్నారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.