మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 11 ఆగస్టు 2022 (18:06 IST)

యమునా నదిలో పడవ ప్రమాదం - 20 మంది మృతి

Boat
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని యమునా నదిలో పడవ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 20 మంది వరకు ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం. మరికొందరు గల్లంతయ్యారు. ఇప్పటివరకు నాలుగు మృతదేహాలను వెలికి తీశారు. మిగిలిన వాటి కోసం గాలిస్తున్నారు. 
 
యమునా నదిలో 50 మంది ప్రయాణికులతో వెళుతున్న పడవ ఒకటి బోల్తా పడింది. కెపాసిటీకి మించి ప్రయాణికులు ఎక్కవడంతో ఈ బోటు బోల్తాపడినట్టు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే 20 మంది మృత్యువాతపడ్డారు. మరో 25 మంది వరకు గల్లంతైనట్టు తెలుస్తోంది. గల్లంతైన వారి కోసం సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. 
 
సహాయక బృందాలు ఇప్పటివరకు నాలుగు మృతదేహాలను వెలికి తీశారు. మిగిలిన మృతదేహాల కోసం గాలిస్తున్నారు. ఇదిలావుంటే, పడవ బోల్తాపడగానే అందులోని వారంతా నదిలో మునిగిపోయారు. వీరిలో ఈత తెలిసిన వారు మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. మిగిలిన వారిలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు.