గురువారం, 30 నవంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 13 ఆగస్టు 2022 (10:53 IST)

విశాఖ రుషికొండ బీచ్‌లో రెండు మృతదేహాలు లభ్యం

deadbody
విశాఖపట్టణం రుషికొండ బీచ్‌లో రెండు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ మృతులను రాష్ట్రంలోని నంద్యాలకు చెందిన వెంకట్ రెడ్డి (30), విజయనగరం జిల్లా తెర్లాంకు చెందిన దివ్య (25)గా గుర్తించారు. మహిళ రుషికొండ హాస్టల్‌లో ఉంటూ సివిల్ పరీక్షలకు సిద్ధమవుతోంది.
 
అప్పుల బాధతో వారు ఆత్మహత్యకు పాల్పడ్డారని సంబంధిత వర్గాలు తెలిపాయి. స్నేహితులమని, రూ.2.5 లక్షల అప్పు తీర్చేందుకు బాధపడ్డారని తెలిసింది. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.