శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 5 జులై 2024 (19:14 IST)

మనిషిని కాటేసిన పాము.. పామును కరిచిన వ్యక్తి.. ఏమైంది?

Snake
సాధారణంగా ఓ పాము కాటేస్తే.. విషపూరితమైనది అయితే.. మనిషి నిమిషాల్లో మరణిస్తాడు. కానీ మనిషి కాటేస్తే పాము చనిపోయిన వింత ఘటన చోటుచేసుకుంది. పాము తనను కాటేసిందన్న కోపంతో తిరిగి దాన్ని కరవడంతో ఆ పాము చనిపోయింది. ఈ ఘటన బీహార్ లోని నవాడాలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. రైల్వే కార్మికుడు సంతోష్ లోహార్.. మంగళవారం రాత్రి భోజనం చేసి నిద్రకు ఉపక్రమించాడు. అంతలో అతడ్ని పాము కాటేసింది. దీంతో ఏదో కుట్టిందని లేచి చూడగా.. పాము కనిపించింది. తనను పాము కాటేసిందన్న కోపంతో.. వెంటనే పామును పట్టుకుని, రెండు సార్లు కొరికాడు. దీంతో పాము మరణించింది. 
 
అతడు సమీపంలోని ఆసుపత్రికి వెళ్లగా.. చికిత్స అందించారు. పాము తనను కరిచినా, తిరిగి అతడు పామును కొరికినా.. విషం అతడ్ని ఏం చేయలేకపోయింది. అతడు ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.