మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 25 మార్చి 2020 (15:30 IST)

ప్రధానితో కేబినేట్ మీటింగ్.. సామాజిక దూరం పాటించిన మంత్రులు

PM Meet
కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో అధికారులు సామాజిక దూరం పాటించారు. డైరక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ అధికారులతో జరిగిన ఈ కేబినెట్ సమావేశంలో ఎమెర్జెన్సీ మెడికల్ రిలీఫ్ అంశంపై ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. 
 
ఇకపై హెల్త్ కేర్ వర్కర్లు, క్వారంటైన్ సెంటర్లు, ఆస్పత్రులు, ల్యాబ్‌లు, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లు, కమ్యూనిటీ కేంద్రాల్లో పనిచేసేవారు తప్పనిసరిగా ఈ ఆదేశాల్ని వంద శాతం పాటించాల్సి ఉంటుంది. కరోనా బాధితులు, అనుమానితులకు సేవలు చేస్తూ... వారు ఎలాంటి రక్షణ వలయం ఏర్పాటు చేసుకోవాలో ఈ ఆదేశాల ద్వారా కేంద్రం తెలిపింది. 
 
కరోనా వైరస్ సోకకుండా ఎలాంటి పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్‌మెంట్ ధరించాలో కేంద్రం వివరాలు ఇచ్చింది. ఇందులో ప్రత్యేక కళ్లద్దాలు, ఫేస్ షీల్డ్, మాస్క్, గ్లోవ్స్, కవర్ ఆల్ లేదా గౌన్లు, హెడ్ కవర్, షూ కవర్ వంటివి ఉన్నాయి.
 
హెల్త్ కేర్ వర్కర్లకు కేంద్రం ప్రత్యేక ఆదేశాల వివరాల్లోకి వెళితే.. 
 
కరోనా సోకిన వారికి సేవ చేసే వారికి కళ్లు, ముక్కు, నోరు, చెవులకు హాని చేయకుండా ఉండేందుకు ఫేస్ షీల్డ్, కళ్లద్దాలు తప్పనిసరి. వీటి ద్వారా రోగుల నుంచీ వట్చే తుంపర్లు వారి ముఖాలపై పడకుండా ఉంటాయి. మాస్కుల్లో మూడు పొరలు ఉన్న మాస్క్ లేదా... N-95 రెస్పిరేటర్ మాస్క్ ధరించాల్సి ఉంటుంది.
 
గ్లోవ్స్ అనేవి కరోనా బాధితులు, అనుమానితుల్ని టచ్ చేసినప్పుడు వైరస్ సోకకుండా కాపాడతాయి. అందువల్ల నిస్ట్రిల్ గ్లోవ్స్ లేదా లాటెక్స్ గ్లోవ్స్ వంటివి వాడాల్సి ఉంటుంది. వీలైనంతవరకూ నిస్ట్రిల్ గ్లోవ్స్ మాత్రమే వాడాలని కేంద్రం సూచించింది. కవరాల్ లేదా గౌన్స్, షూ కవర్లు, హెడ్ కవర్లు తప్పక వాడాలి. ఈ ఆదేశాలన్నీ తప్పక పాటించాలని కేంద్ర ఆరోగ్య శాఖ తాజాగా ఆదేశించింది.