గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 30 డిశెంబరు 2023 (09:57 IST)

కొత్త సంవత్సరంలో తొలి చంద్రగ్రహణం ఎపుడు వస్తుంది?

blue moon
మరికొన్ని గంటల్లో 2023 సంవత్సరం కాలచక్రంలో కలిసిపోనుంది. కొత్త 2024లోకి అడుగుపెట్టనున్నాం. అయితే, ఈ కొత్త యేడాదిలో తొలి చంద్రగ్రహణ మార్చి 25వ తేదీ సోమవారం వస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. చంద్రగ్రహణం ఆ రోజున ఉదయం 10.41 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 3.01 గంటలకు ముగుస్తుందని, ఇది దాదాపు నాలుగు గంటల పాటు కొనసాగుతుందని తెలిపారు. 
 
పైగా, అదో రోజున హోళీ పండుగ వచ్చింది. అయితే ఈ చంద్రగ్రహణం మన దేశంలో మాత్రం కనిపించదు. ఆస్ట్రేలియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణాఫ్రికా, అట్లాంటిక్ మహాసముద్రం, పసిఫిక్ మహాసముద్రం, ఇతర అనేక ప్రాంతాల్లో కనువిందు చేయనుంది.
 
ఇక 2024 సంవత్సరంలో రెండవ చంద్రగ్రహణం సెప్టెంబర్ 18న సంభవించనుంది. ఉదయం 6.12 గంటలకు ప్రారంభమై ఉదయం 10.17 గంటల వరకు కొనసాగుతుంది. ఈ చంద్రగ్రహణం కూడా ఇండియాలో కనిపించదు. యూరప్, ఉత్తర, దక్షిణ అమెరికా, దక్షిణ, ఉత్తర ఆఫ్రికా, అట్లాంటిక్ మహాసముద్రం, ఆర్కిటిక్ మహాసముద్రంలోని ప్రాంతాల్లో కనిపించనుంది.