శుక్రవారం, 13 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

28న తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత

ttd temple
ఈ నెల 29వ తేదీన చంద్రగ్రహణం రానుంది. దీంతో 28వ తేదీన శ్రీవారి ఆలయాన్ని మూసివేస్తారు. 28వ తేదీ రాత్రి 7.05 గంటల నుంచి శ్రీవారి ఆలయం తలపులను ఎనిమిది గంటల పాటు మూసివేస్తారు. ఈ నేపథ్యంలో ఆ రోజు శ్రీవారిని దర్శించుకోవాలనే బక్తులు మరో రోజుకు వాయిదా వేసుకోవాలని తితిదే అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. 
 
29వ తేదీన తెల్లవారుజామున 1.05 గంటలకు మొదలయ్యే గ్రహణం 2.22 గంటల వరకు కొనసాగుతుంది. గ్రహణ సమయానికి ఆరు గంటల ముందు ఆలయ తలుపులు మూసివేయడం ఆనవాయితీగా వస్తుంది. దీంతో 28వ తేదీన రాత్రి 7.05 గంటలకు ఆలయ తలుపులు మూసివేస్తారు. 29వ తేదీన తెల్లవారుజామున ఏకాంతంలో ఆలయాన్ని శుద్ది చేసి ఏకాంత సేవ నిర్వహిస్తారు. ఆ తర్వాత భక్తులకు తిరిగి శ్రీవారి దర్శన భాగ్యం కల్పిస్తారు. 
 
'ఇండియా' పేరు మార్చేస్తున్నారు ... పాఠ్యపుస్తకాల్లో ఇకపై 'భారత్' 
 
ఇండియా పేరు క్రమంగా మారిపోతుంది. ఇండియా స్థానంలో భారత్ అని చేర్చుతున్నారు. ఢిల్లీ వేదికగా జరిగిన జీ20 శిఖరాగ్ర సదస్సులో కూడా ఇండియా స్థానంలో భారత్ అనే పేరును ఉపయోగించారు. ఇపుడు నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్.సి.ఆర్.టి) ముద్రించే పుస్తకాల్లో కూడా ఇండియా పేరును భారత్‌గా ముద్రిస్తున్నారు. ఈ మేరకు ఎన్టీఆర్టీ నియమించిన ఉన్నత స్థాయి కమిటీ కూడా సిఫార్సు చేసింది. దీంతో ఎన్టీఆర్టీ ముద్రించే అన్ని తరగతలు పాఠ్యపుస్తకాల్లో ఇండియా పేరు స్థానంలో ఇకపై భారత్ అని ముద్రించాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. అలాగే, ప్రాచీన చరిత్రను 'క్లాసిక్ హిస్టరీ' పేరుతో విద్యార్థులకు బోధించాలని సిఫార్సు చేసింది. 
 
'భారత్ పేరు.. పురాతనమైంది. ఏడువేల సంవత్సరాల క్రితం విష్ణుపురాణం లాంటి ప్రాచీన గ్రంథాల్లో 'భారత్' ప్రస్తావన ఉంది' అని ఆ కమిటీ ఛైర్మన్ ఇసాక్ వెల్లడించారు. అయితే ఈ సిఫార్సులపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఎన్సీఈఆర్టీ ఛైర్మన్ దినేశ్ ప్రసాద్ సకలాని తెలిపారు. ఇటీవల జీ20 సమావేశాల సందర్భంగా ఆహ్వానపత్రాల్లో 'ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా' బదులు 'ప్రెసిడెంట్ ఆఫ్ భారత్' అని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా పేర్కొన్న సంగతి తెలిసిందే. సదస్సులో ప్రధాని నరేంద్ర మోడీ నామఫలకంలోనూ ఇండియా స్థానంలో భారత్ అని ఉంది.
 
మరోవైపు, పాఠ్యపుస్తకాల్లో హిందూ విజయాలకు ప్రముఖ స్థానం ఇవ్వాలని తమ కమిటీ పేర్కొందని ఇసాక్ తెలిపారు. 'పాఠ్యపుస్తకాల్లో ఎక్కువగా మన వైఫల్యాలనే ప్రస్తావించారు. మొగలులు, సుల్తానులపై మన విజయాలను పొందుపరచలేదు. చరిత్రను ప్రాచీన, మధ్య, ఆధునిక యుగాలుగా విభజించి భారత్ చీకట్లో ఉన్నట్లు బ్రిటిషర్లు చూపించారు. దేశ శాస్త్ర విజ్ఞానాన్ని, ప్రగతిని విస్మరించారు. అందుకే మధ్య, ఆధునిక యుగాలతో పాటు.. భారత్ చరిత్రలో సంప్రదాయ యుగాన్ని కూడా విద్యార్థులకు నేర్పాలని సూచించాం' అని ఇసాక్ చెప్పారు.