కన్నతల్లిని గొడ్డలితో నరికాడు.. మెదడును వెలికి తీసి.. పాన్‌లో వేయించాడు..

Last Updated: శనివారం, 31 ఆగస్టు 2019 (11:12 IST)
కన్నకొడుకు కిరాతకుడిగా మారిన కథ ఇది. కన్నతల్లిని కిరాతకంగా హతమార్చడమే కాకుండా ఆమె మెదడును ‌పాన్‌లో వేసి ఫ్రై చేసిన దుర్ఘటన ఛత్తీస్‌ఘడ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. 32 ఏళ్ల కుమారుడు తన కన్నతల్లిని దారుణంగా హత్యచేశాడు.

ఆమె మెదడును శరీరం నుంచి వెలికి తీశాడు. తర్వాత పాన్‌లో వేయించాడని.. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన సీతారామ్ ఇరాన్ అనే వ్యక్తి తన 50 ఏళ్ల తల్లి తాగడానికి ఇవ్వలేదని మంగళవారం హత్య చేసినట్లు డైలీ మెయిల్ వెల్లడించింది.

అతను తరచుగా తాగి ఇంటికి వచ్చి తల్లిని కొట్టేవాడు. అలా తాగుడుకు డబ్బివ్వలేదనే కోపంతో అతను తన తల్లి పుర్రెపై గొడ్డలితో కొట్టాడు. ఆపై మెదడును వెలికి తీసి.. వేయించాలని చూశాడు. ఈ వ్యవహారాన్ని కిరాతకుడి బావ చూసి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అతడిని పోలీసులు ట్రాక్ చేసి అరెస్ట్ చేశారు.

అతను రక్తం తడిసిన బట్టలు ధరించి వున్నాడని పోలీసులు తెలిపారు. అతను మానసిక పరిస్థితి బాగోలేదని పోలీసులు చెప్పారు. నిందితుడు ఈ నేరానికి పాల్పడినట్లు అంగీకరించాడు.దీనిపై మరింత చదవండి :