గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By జె
Last Modified: సోమవారం, 1 ఫిబ్రవరి 2021 (20:32 IST)

అత్తను బెడ్ రూంలోకి లాగి బెడ్ పైన తోసిన అల్లుడు, ఆమె ప్రతిఘటించడంతో?

చిన్నారులు, మహిళలపై లైంగిక దాడులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఎన్ని చట్టాలు వచ్చినా కూడా మృగాళ్ళు మాత్రం మారడం లేదు. అమ్మగా భావించాల్సి అత్తపై కన్నేసిన అల్లుడు ఆమెతో శారీరక సుఖాన్ని అనుభవించాలనుకున్నాడు. అయితే చివరకు ఆమె ప్రాణాలనే తీసేశాడు.
 
యుపిలోని మీరట్ ప్రాంతంలో నివాసముండే షాకీర్ బీటెక్ చదువుకోవడానికి మేనత్త ఇంటికి వెళ్ళాడు. వారి ఇంట్లోనే ఉంటూ కాలేజీకి వెళ్లేవాడు. షాకీర్ మేనత్తకి పిల్లలు లేరు. దీంతో షాకీర్‌ను సొంత కొడుకులా చూసుకుంది. అతను అడిగిన వంటలన్నీ చేసి పెట్టేది. కావాల్సినంత డబ్బులు ఇచ్చేది.
 
అయితే షాకీర్ అంతకుమించి ఆమె నుంచి ఆశించాడు. అదే పడక సుఖం. మేనత్త అనే ఆలోచన కూడా లేని షాకీర్ ఆమె చేయి పట్టుకున్నాడు. బలవంతంగా బెడ్ రూంలోకి లాగాడు. వారం క్రితం ఈ ఘటన జరిగితే నిశ్చేష్టురాలైన అత్త ఏం జరుగుతుందో తెలియక కాసేపు నిల్చుని పోయింది.
 
ఆ తరువాత తేరుకుని మేనల్లుడి చెంప చెళ్లుమనిపించింది. విషయాన్ని తన భర్తకు చెప్పలేదు. దీంతో మరింత రెచ్చిపోయిన షాకీర్ శనివారం కాలేజీకి వెళ్ళలేదు. అత్తను మళ్ళీ గదిలోకి లాగాడు. ఆ తరువాత ఆమె ప్రతిఘటించడంతో అదే బెడ్‌కు ఆమె తలను వేసి గట్టిగా కొట్టాడు. ఆమె స్పృహ తప్పి పడిపోయింది. 
 
తీవ్ర రక్తస్రావమవుతుండటంతో భయపడి అక్కడి నుంచి పారిపోయాడు. సాయంత్రానికి ఇంటికి వచ్చిన ఆమె భర్త, ఆమె రక్తపు మడుగులో పడి వుండటం చూసి షాకయ్యాడు. ఐతే అప్పటికే ఆమె చనిపోయింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిందితుడిని పోలీసులు పట్టుకుని విచారిస్తే అసలు విషయం బయటపడింది.