ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 13 ఫిబ్రవరి 2021 (12:26 IST)

సోనూసూద్‌ పెద్ద మనసు!

బాలీవుడ్‌ నటుడు సోనూసూద్‌ మరోసారి పెద్ద మనసును చాటుకున్నారు. సోనూ స్వస్థలమైన పంజాబ్‌లోని మోగా పట్టణంలో ఎనిమిదిమంది నిరుద్యోగులకు ఎలక్ట్రిక్‌ రిక్షాలు (ఈ-రిక్షా) లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సోనూసూద్‌ మీడియాతో మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా 150 ఈ-రిక్షాలు పంచాలని నిర్ణయించుకున్నానన్నారు.

ఫలితంగా కొంతమందికైనా ఉపాధి దొరుకుతుందని ఆశించారు. తనకు సేవాగుణం అలవడటానికి తన తల్లిదండ్రులే కారణమని చెప్పారు. సాయం చేయగలిగే స్థితిలో ఉండే ప్రతి ఒక్కరూ అవసరమైనవారికి తోచినంత సాయం చేయాలని పిలుపునిచ్చారు.

అవసరమైనవారికి తాను సాయం చేస్తూ అందరిలానే తన బాధ్యతను నిర్వర్తిస్తున్నానని సోనూసూద్‌ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సోనూసూద్‌ సోదరి మాళవిక సచార్‌, బావ గౌతమ్‌ సచార్‌ పాల్గొన్నారు.