శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 12 జూన్ 2018 (16:14 IST)

మంత్రి పదవి ఇస్తానంటే వద్దన్నాడు.. తుపాకీతో కాల్చుకుని చనిపోయాడు.. ఎవరు?

ఆయన ఓ వివాదాస్పద ఆధ్యాత్మికవేత్త. ఆయన సేవలకు మెచ్చి మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మంత్రి పదవిని ఇస్తామని కమలనాథులు కబురు పంపారు. అయితే, తనకు మంత్రి పదవి వద్దని తెగేసి చెప్పారు. అలా చెప్పిన కొన్ని రోజు

ఆయన ఓ వివాదాస్పద ఆధ్యాత్మికవేత్త. ఆయన సేవలకు మెచ్చి మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మంత్రి పదవిని ఇస్తామని కమలనాథులు కబురు పంపారు. అయితే, తనకు మంత్రి పదవి వద్దని తెగేసి చెప్పారు. అలా చెప్పిన కొన్ని రోజుల్లోనే ఆయన తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇంతకీ ఆయన ఎవరన్నదే కదా మీ సందేహం.
 
ఆయన ఎవరో కాదు.. వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు భయ్యూజీ మహారాజ్. ఊరు ఇండోర్. మధ్యప్రదేశ్ రాష్ట్రం. ఈయన మంగళవారం ఆత్మహత్య చేసుకున్నారు. ఆశ్రమంలోనే తుపాకీతో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. 
 
తుపాకీ శబ్దంతో షాక్‌కు గురైన ఆయన శిష్యులు భయ్యూజీ గదిలోకి వెళ్లి చూడగా ఆయన రక్తపు మడుగులో పడి ఉన్నారు. దీంతో హుటాహుటిన స్వామిజీను ఇండోర్‌ బాంబే ఆసుపత్రికి తరలించారు. భయ్యూజీని పరీక్షించిన వైద్యులు ఆయన మరణించినట్లు ధ్రువీకరించారు. 
 
గత ఏప్రిల్ నెలలో భయ్యూజీకి మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం మంత్రి పదవిని ఆఫర్‌ చేసింది. అయితే, దాన్ని భయ్యూజీ తిరస్కరించారు. ప్రజలకు చేరువయ్యేందుకు పదవులు అక్కర్లేదని తెగేసి చెప్పారు కూడా. ఇంతలోనే ఈ విషాదకర నిర్ణయం తీసుకుని తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయాడు.