మంగళవారం, 18 మార్చి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Updated : సోమవారం, 17 మార్చి 2025 (22:30 IST)

స్టేఫ్రీ- మెన్స్ట్రుపీడియా ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు శిక్షణ, 10 లక్షలకు పైగా బాలికలకు అవగాహన

Periods
రుతుక్రమ పరిశుభ్రతలో ప్రముఖ బ్రాండ్ అయిన స్టేఫ్రీ, రుతుక్రమ విద్యపై దృష్టి సారించి వేగంగా అభివృద్ధి చెందుతున్న స్టార్టప్ అయిన మెన్స్ట్రుపీడియాతో భాగస్వామ్యంలో ఒక ముఖ్యమైన మైలురాయిని వేడుక చేసుకుంటోంది. స్టేఫ్రీ, మెన్స్ట్రుపీడియా కలిసి, పాఠశాలల్లో ఋతుక్రమ విద్యను అందించడానికి 10,000 మందికి పైగా ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చాయి. ఋతుక్రమ ఆరోగ్యాన్ని బాగా అర్థం చేసుకునేందుకు, అంగీకరించేందుకు, సాధారణీకరించేందుకు, యువతుల భవిష్యత్తును సానుకూలంగా రూపొందించే వాతావరణాన్ని పెంపొందించడానికి పది లక్షల కంటే ఎక్కువ మంది బాలికలకు రుతుక్రమ పరిశుభ్రతపై అవగాహన కల్పించాయి.
 
2020లో స్టేఫ్రీ, యువతులు, ఉపాధ్యాయులకు రుతుక్రమ ఆరోగ్యం గురించి అవగాహన కల్పించడం మరియు దానితో ముడిపడి ఉన్న అపోహలను తొలగించడం లక్ష్యంగా మెన్స్ట్రుపీడియాతో కలిసి పనిచేసింది. దీర్ఘకాలిక మార్పును తీసుకు రావడానికి, గుణాత్మక ప్రభావాన్ని సృష్టించడానికి సమగ్ర విధానాన్ని తీసుకుంటూ, ఈ కార్యక్రమం ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడం, ఫెసిలిటేటర్లకు పీరియడ్స్ పై క్యాస్కేడ్ విద్యను అందించడం, సామాజిక నిషేధాలను పరిష్కరించడం అలాగే 9-15 సంవత్సరాల మధ్య బాలికలు, అబ్బాయిలకు పీరియడ్స్ చుట్టూ సానుకూల మనస్తత్వాన్ని పెంపొందించడానికి అవగాహన కల్పించడంపై దృష్టి పెడుతుంది. దీనికి జీవం పోస్తూ, మెన్స్ట్రుపీడియా కామిక్ పుస్తకాలను ఉపయోగిస్తుంది - యువతులను రుతుక్రమ పరిశుభ్రతతో పాటు యుక్తవయస్సు, సైకిల్ ట్రాకింగ్, పోషకాహారం, మరిన్నింటికి సంబంధించిన హార్మోన్ల మార్పులతో సహా కౌమార ఆరోగ్యం యొక్క ఇతర అంశాలపై నిమగ్నం చేయడానికి, అవగాహన కల్పించడానికి ఒక సృజనాత్మక మార్గం.
 
గత 5 సంవత్సరాలలో, స్టేఫ్రీ, మెన్స్ట్రుపీడియా 10,000 కంటే ఎక్కువ మంది ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చాయి. 12 లక్షలకు పైగా కామిక్ పుస్తకాలను పంపిణీ చేశాయి. 14,500+ వర్క్‌షాప్‌లను నిర్వహించాయి. భారతదేశం అంతటా 36,500 కంటే ఎక్కువ పాఠశాలలకు చేరుకున్నాయి. అమ్మాయిలు, అబ్బాయిలు, వారి కుటుంబాలు, సమాజంలోనే కాకుండా తరగతి గదిలో కూడా సానుకూల మార్పును సృష్టిస్తున్నాయి.
 
ఈ ముఖ్యమైన మైలురాయి గురించి కెన్వ్యూ ఇండియా బిజినెస్ యూనిట్ హెడ్-ఎసెన్షియల్ హెల్త్, మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ మనోజ్ గాడ్గిల్ మాట్లాడుతూ, "చాలామంది అమ్మాయిలకు పాఠశాలలోనే పీరియడ్స్ మొదలవుతాయి. వారి ప్రారంభ అనుభవాలు పీరియడ్స్ పట్ల వారి వైఖరిని ప్రభావితం చేస్తాయి. ఈ ప్రయాణంలో, మార్పు ఛాంపియన్‌గా ఒక టీచర్ పీరియడ్స్ గురించి సానుకూల మనస్తత్వాన్ని సృష్టించడానికి, పీరియడ్స్ సంభాషణలను సాధారణీకరించడానికి జ్ఞానాన్ని వ్యాప్తి చేయడంలో కీలక పాత్ర పోషిస్తారు. మా బ్రాండ్ ఉద్దేశ్యంలో భాగంగా, ఏ అమ్మాయి కూడా తన పీరియడ్స్ గురించి భయం, సిగ్గు లేదా అసౌకర్యాన్ని అనుభవించని ప్రపంచాన్ని సృష్టించడానికి గాను పీరియడ్స్ సంభాషణలను సాధారణీకరించ డానికి స్టేఫ్రీ కట్టుబడి ఉంది. మెన్స్ట్రుపీడియాతో కలిసి, 10,000 మందికి పైగా ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడం,10 లక్షల మంది కంటే ఎక్కువ మంది బాలికలను సానుకూలంగా ప్రభావితం చేయడం ద్వారా వారిని పీరియడ్స్‌కు సిద్ధం చేయడం మాకు సంతోషంగా ఉంది. ఈ మైలురాయి ఇటు ఒక తరగతి గదిలో, అటు సమాన భవిష్యత్తును రూపొందించే మా ప్రయాణంలో ఒక అర్ధవంతమైన అడుగును సూచిస్తుంది’’ అని అన్నారు.
 
మెన్స్ట్రుపీడియా సహ వ్యవస్థాపకురాలు అదితి గుప్తా మాట్లాడుతూ, "మన దేశంలో ప్రతి నలుగురు అమ్మాయిలలో ఒకరు తన పీరియడ్స్ సమయంలో పాఠశాలను మిస్ అవుతారు. సంవత్సరాలుగా, ఉపాధ్యాయులు తరగతి గదులలో పీరియడ్స్ గురించి చర్చించడం మానేస్తున్నారు. ఇది మారాలని మాకు తెలుసు. పీరియడ్స్‌ను నిషిద్ధంగా చూడని భవిష్యత్తును, పీరియడ్స్ విద్యను సాధారణీకరించి బహిరంగంగా బోధించే భవిష్యత్తును సృష్టించడానికి మేం అవిశ్రాంతంగా కృషి చేస్తున్నాం. గత దశాబ్ద కాలంగా, మెన్స్ట్రుపీడియా ఉపాధ్యాయులకు పీరియడ్స్‌పై సాంస్కృతికంగా సున్నితమైన టూల్‌కిట్‌ను అందించింది. అన్ని భారతీయ భాషలలో అందుబాటులో ఉన్న మా శిక్షణ సామగ్రి, ఉపాధ్యాయులకు ఆకర్షణీయమైన వర్క్‌షాప్‌లు నిర్వహించడానికి, ఋతుక్రమం పరిశుభ్రతను చర్చించడానికి, అపోహలను తొలగించడానికి సహాయపడుతుంది. స్టేఫ్రీతో మా భాగస్వామ్యంలో, స్త్రీత్వంలోకి అడుగుపెట్టే బాలికలు నమ్మకంగా ఉండటానికి, ఎటువంటి అడ్డంకులు లేకుండా వారి కలలను వెంబడించడానికి వేలాది తరగతి గదులను పీరియడ్స్‌కు సిద్ధంగా ఉంచాం. పీరియడ్స్ టాబూ ముగిసిన యుగం వైపు పయనించడానికి ఇదో మార్గం’’ అని అన్నారు.