శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By మోహన్
Last Updated : సోమవారం, 15 ఏప్రియల్ 2019 (18:45 IST)

భారత్ చేసిన 'నిర్భయ్' ప్రయోగం విజయవంతం

భారత్‌ సబ్‌ సోనిక్‌ క్రూయిజ్‌ క్షిపణి ‘నిర్భయ్‌’ను విజయవంతంగా పరీక్షించింది. వెయ్యి కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యం ఉన్న ఈ క్షిపణిని ఒడిశా తీరంలోని చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి విజయవంతంగా ప్రయోగించారు. 
 
పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో డీఆర్‌డీవో సంస్థ రూపొందించిన ‘నిర్భయ్‌’ క్షిపణి దాదాపు 300 కిలోల వార్‌హెడ్‌ను మోసుకెళ్లగలదు. ఇది టర్బోఫ్యాన్ లేదా టర్బోజెట్ ఇంజన్‌తో ప్రయాణించనుంది. అత్యాధునికమైన నావిగేషన్ సిస్టమ్‌తో దూసుకెళ్లేలా దీనిని రూపొందించారు.