శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 21 డిశెంబరు 2016 (12:12 IST)

శేఖర్ రెడ్డికి రామ్మోహన్ రావుకు లింకు? ఐటీ దాడులు.. అన్నాడీఎంకే నేతల్లో హడల్..

తమిళనాడులో వరుసగా ఐటీ దాడులు జరగడంతో అన్నాడీఎంకే నేతలు హడలిపోతున్నారు. ఇటీవలే అన్నాడీఎంకే నేత, టీటీడీ బోర్డు సభ్యుడు శేఖర్ రెడ్డి ఇంట్లో రూ. 130 కేజీల బంగారం, రూ. 170 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు.

తమిళనాడులో వరుసగా ఐటీ దాడులు జరగడంతో అన్నాడీఎంకే నేతలు హడలిపోతున్నారు. ఇటీవలే అన్నాడీఎంకే నేత, టీటీడీ బోర్డు సభ్యుడు శేఖర్ రెడ్డి ఇంట్లో రూ. 130 కేజీల బంగారం, రూ. 170 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా లభించిన ఫైల్స్ ఆధారంగా ఐటీ అధికారులు పలువురి మీద నిఘా వేశారు. శేఖర్ రెడ్డికి ఎవరెవరు సహకరించారు అనే దానిపై ఐటీ అధికారులు ఆరా తీశారు. 
 
శేఖర్ రెడ్డికి తమిళనాడు సీఎస్ రామ్మోహన్ రావు లింక్ ఉన్నట్లు సమాచారం. ఇందులో భాగంగా రామ్మోహనరావు ఇంట్లో ఐటీ అధికారులు దాడులు చేశారు. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత, ప్రస్తుత ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, నెచ్చెలి శశికళతో పాటు అన్నాడీఎంకే మంత్రులకు అత్యంత సన్నిహితుడైన రామ్మోహన్ రావు ఇంటి మీద ఐటీ దాడులు జరగడం పెద్ద చర్చకు దారి తీసింది. 
 
చెన్నైలోని అన్నానగర్‌లోని రామ్మోహన్ రావు ఇంటిలో బుధవారం వేకువ జామున ఐదు గంటల నుంచి ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. వందల కోట్ల రూపాయల విలువైన బంగారాన్ని నగదుగా మార్చారని తమిళనాడు సీఎస్ రామ్మోహన్ రావుపై ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సోదాల్లో రామ్మోహన్ రావు ఇంట్లో పెద్ద మొత్తంలో నల్లధనం స్వాధీనం చేసుకున్నారని తెలుస్తోంది.