శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 16 జనవరి 2021 (13:12 IST)

JalliKattu పోటీలు ప్రారంభం.. సీఎం పళని స్వామి జెండా ఊపి..

jallikattu
సంక్రాంతికి సంప్రదాయ పోటీల్లో ఒకటైన జల్లికట్టు పోటీలు తమిళనాడులో అట్టహాసంగా జరుగుతున్నాయి. తమిళనాడులోని మధురైలో జరుగుతున్న జల్లికట్టు పోటీలకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, డీఎంకే ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్ కొడుకు, యాక్టర్ ఉదయనిధితో కలిసి హాజరయ్యారు. సంప్రదాయ క్రీడ జల్లికట్టు మొదలైంది. ఈ  పోటీల్లో యువత ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఆవేశంతో దూసుకొస్తున్న ఎద్దులను కట్టడి చేస్తున్నారు. 
 
దాదాపు 200 ఎడ్లను పోటీల్లో వినియోగిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలతో 150 కంటే తక్కువ మంది ఆటగాళ్లు జల్లికట్టులో పాల్గొంటున్నారు. అలాగే 50 శాతం జనాన్నే పోటీలు చూసేందుకు అనుమతిస్తున్నారు. ప్లేయర్లు కరోనా నెగిటివ్ సర్టిఫికెట్ చూపించాకే వారిని ఆటకు అనుమతించారు. సంక్రాంతి సందర్భంగా జరిగే జల్లికట్టు పోటీల్లో పాల్గొనేందుకు చూసేందుకు ప్రజలు ఎంతగానో ఆసక్తి చూపిస్తుంటారు.
 
15న పాలమేడు, 16న ప్రపంచ ప్రసిద్ధి గాంచిన అలాంగనల్లూర్‌లో జల్లికట్టు పోటీలు జరుగుతాయి. ఈ ఏడాది 14న అవనీయపురంలో, 15న పాలమేడులో జరుగగా, 16న ప్రసిద్ధి గాంచిన అలాంగనల్లూరులో జల్లికట్టు పోటీలు జరుగుతున్నాయి. 
 
ఈ పోటీల్లో 700 ఎద్దులు, 300 మంది వీరులు పాల్గొన్నారు. ఈ ఏడాది తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జాతీయ నేతల పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. 16న అలాంగనల్లూర్‌లో జరగనున్న జల్లికట్టు పోటీలు సీఎం పళనిస్వామి ప్రారంభించారు.