ఆదివారం, 24 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : గురువారం, 23 నవంబరు 2017 (15:04 IST)

చిన్నమ్మ వర్గానికి మరో షాక్-ఓపీఎస్, ఈపీఎస్‌కే రెండాకులు

ఎలక్షన్ కమిషన్ శశికళ వర్గానికి షాక్ ఇచ్చింది. అన్నాడీఎంకే అధికారిక రెండాకుల చిహ్నాన్ని ఓపీఎస్, ఈపీఎస్ వర్గానికి కేటాయిస్తున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. రెండాకుల చిహ్నాన్ని తమకు కేటాయించాలనే శశికళ

ఎలక్షన్ కమిషన్ శశికళ వర్గానికి షాక్ ఇచ్చింది. అన్నాడీఎంకే అధికారిక రెండాకుల చిహ్నాన్ని ఓపీఎస్, ఈపీఎస్ వర్గానికి కేటాయిస్తున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. రెండాకుల చిహ్నాన్ని తమకు కేటాయించాలనే శశికళ వర్గం డిమాండ్‌ను ఎన్నికల సంఘం తోసిపుచ్చింది. అన్నాడీఎంకే మాజీ అధినేత్రి జయలలిత వారసులం తామేనని వాదించిన చిన్నమ్మ వర్గానికి ఈసీ షాక్ ఇచ్చింది. 
 
ఇప్పటికే ఐటీ దాడులతో భారీ ఎత్తున నగదు, నగలు, ఆస్తుల పత్రాలు పట్టుబడ్డాయని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరగడంతో శశికళ ప్రతిష్ఠ గంగలో కలిసిపోయింది. తాజాగా ఎలక్షన్ కమిషన్ కూడా రెండాకుల చిహ్నాన్ని ఓపీఎస్, ఈపీఎస్‌కు కేటాయించడం ద్వారా మరోసారి శశికళ వర్గానికి దిమ్మదిరిగినట్లైంది.
 
దివంగత సీఎం జయలలితకు తర్వాత ఆర్కే నగర్ ఎన్నికల్లో పోటీపడేందుకు శశికళ వర్గం, ఓపీఎస్ వర్గం పోటీ పడింది. అయితే ఆర్కే నగర్ ఎన్నికల కోసం ఎన్నికల సంఘం ఓపీఎస్‌కు విద్యుద్దీపం, చిన్నమ్మ వర్గానికి టోపీని ఎన్నికల చిహ్నంగా కేటాయించింది. 
 
అయితే ఓపీఎస్ వర్గం, ఈపీఎస్ వర్గం ఒకే తాటిపై వచ్చాక.. చిన్నమ్మ వర్గాన్ని వారు పక్కనబెట్టారు. కీలక పదవుల నుంచి శశికళను, దినకరన్‌ను తప్పించారు. ఫలితంగా ఈసీ ఈపీఎస్, ఓపీఎస్ వర్గానికి షాక్ ఇస్తూ.. రెండాకుల చిహ్నాన్ని కేటాయించింది.