గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 18 అక్టోబరు 2020 (10:07 IST)

అన్నా.. నా ప్రేమను అడ్డుకున్నారు.. ఇపుడు మీకు సంతోషమేనా?

ఓ ప్రేమికురాలు బలవన్మరణానికి పాల్పడింది. తనకంటే రెండేళ్ళ యువకుడిని ప్రేమించింది. కానీ, ఆ యువకుడితో వివాహం చేసేందుకు యువతి తల్లిదండ్రులు నిరాకరించారు. దీంతో మనస్తాపం చెందిన ఆ యువతి బలవన్మరణానికి పాల్పడింది. ఆమె ఆత్మహత్య చేసుకునే ముందు.. తన అన్నకు ఫోన్ చేసి.. అన్నా... నా ప్రేమను అడ్డుకున్నారు... ఇపుడు మీకు సంతోషమేనా... అంటు ఫోన్ కట్ చేసి, ఆ తర్వాత ప్రాణాలు తీసుకుంది. ఈ విషాదకర సంఘటన తమిళనాడు రాష్ట్రంలని మదురై జిల్లాలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లాలోని తేనూరు అంకాళ పరమేశ్వరి ఆలయ వీధికి చెందిన ఆర్ముగం అనే వ్యక్తి కుమార్తె నందిని(22). ఈమెకు రెండేళ్ల కిత్రం ఫేస్‌‌బుక్‌ ద్వారా కోయంబత్తూరుకు చెందిన 20 ఏళ్ల యువకుడితో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. 
 
ఈ క్రమంలో నందినికి కోయంబత్తూర్‌ గాంధీపురంలో ఉన్న ఓ సెల్‌ఫోన్‌ సంస్థలో ఉద్యోగం రావడంతో ఆమె అక్కడ చేరింది. దీంతో సదరు యువకుడు చేరణ్‌మానగరంలో ఉన్న ఓ ఉమెన్స్‌ హాస్టల్‌లో నందినికి బస కల్పించాడు. ఆ తర్వాత వారిద్దరూ తరచూ కలుసుకుంటూ వచ్చారు. అయితే, తమ కుమార్తె ప్రేమ వ్యవహారం తెలుకున్న తల్లిదండ్రులు...యువకుడి తల్లిదండ్రులను విచారించి. 
 
ఈ విచారణలో యువకుడు కంటే నందిని రెండు సంవత్సరాలు పెద్దదని తేలింది. దీంతో ఈ పెళ్లికి తాము అంగీకరించమని, అందువల్ల తమ కుమారుడితో నందిని కలవడం మాన్పించాలని యువకుడి తల్లిదండ్రులు యువతి తల్లిదండ్రులను కోరారు. ఆతర్వాత నందినిని తల్లిదండ్రులు మందలించారు. దీంతో, మనస్తాపం చెందిన నందిని ఎవరితో మాట్లాడకుండా ఉండిపోయింది. 
 
ఈ క్రమంలో తన అన్నకు ఫోన్‌ చేసిన నందిని 'నా ప్రేమను అడ్డుకున్నారు... ఇప్పుడు మీకు సంతోషమేనా?' అంటూ ఫోన్‌ కట్‌ చేసింది. అనంతరం తన గదిలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పీలమేడు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కోవై ప్రభుత్వా సుపత్రికి తరలించి, ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.