శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 1 జనవరి 2019 (11:46 IST)

టీ బాగోలేదని సర్వర్ ముఖంపై పోసేశాడు..

హోటల్‌లో పనిచేసే పనివాడు టీ తెచ్చి అందరికీ సర్వ్ చేస్తున్నాడు. ఇలా ఓ డీఎస్పికి కూడా టీ సర్వ్ చేశాడు. అయితే టీ బాగోలేదని ఆ డీఎస్పీ.. ఆ వేడి వేడిగా వున్న టీని సర్వర్ మొహాన్నే పోశాడు. అంతటితో ఆగకుండా అతనిపై దాడి చేజేసుకున్నాడు. 
 
ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. సిబ్బందితో కలిసి వెళ్తున్న డీఎస్పీ మార్గమధ్యంలో ఓ హోటల్ వద్ద బండిని ఆపి బ్రేక్ తీసుకున్నారు. అందరూ టీ ఆర్డర్ ఇచ్చారు. 
 
హోటల్ పనివాడు టీ తెచ్చి అందరికీ సర్వ్ చేశాడు. అది తాగిన డీఎస్పీ టీ తెచ్చిచ్చిన సర్వర్‌ను పిలిచి అతని ముఖంపై పోశాడు. టీ బాగోలేదని బూతులు తిట్టాడు. చెంపపై కొట్టాడు. ఈ ఘటన సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యింది. ఇంత చేసినా.. సదరు అధికారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలుస్తోంది.