సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By TJ
Last Modified: బుధవారం, 6 సెప్టెంబరు 2017 (19:38 IST)

చరిత్ర తిరగరాస్తా.. నాకిక తిరుగేలేదు - పళణిస్వామి

పళణిస్వామికి ఓవర్ కాన్ఫిడెంట్స్ బాగానే ఎక్కువైనట్లుంది. ఇప్పటివరకు మైనారిటీలో ప్రభుత్వం ఉందని అవిశ్వాసానికి అవకాశం ఇవ్వండంటూ ప్రతిపక్ష డిఎంకే పార్టీ ప్రయత్నించిన విషయం తెలిసిందే. ప్రతిపక్ష నేతల విషయం అటుంచితే శశికళ మేనల్లుడు దినకరన్ కూడా రకరకాల ప్రయత

పళణిస్వామికి ఓవర్ కాన్ఫిడెంట్స్ బాగానే ఎక్కువైనట్లుంది. ఇప్పటివరకు మైనారిటీలో ప్రభుత్వం ఉందని అవిశ్వాసానికి అవకాశం ఇవ్వండంటూ ప్రతిపక్ష డిఎంకే పార్టీ ప్రయత్నించిన విషయం తెలిసిందే. ప్రతిపక్ష నేతల విషయం అటుంచితే శశికళ మేనల్లుడు దినకరన్ కూడా రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. పళణిస్వామి వెంట ఉన్న 22 మంది ఎమ్మెల్యేలను తన వెంట తీసుకెళ్ళిపోయాడు దినకరన్. 
 
ఇక పళణిస్వామి ప్రభుత్వం పడిపోవడం ఖాయమని అందరూ అనుకున్నారు. గత నెల 28వ తేదీ కూడా కేవలం 78 మంది ఎమ్మెల్యేలు అన్నాడిఎంకే సమావేశానికి హాజరయ్యారు. ఇక అందరూ అనుకున్నారు పళణి ప్రభుత్వం కూలిపోతుందని.. కానీ నిన్న జరిగిన అన్నాడిఎంకే ఎమ్మెల్యేల సమావేశంలో 109 మంది ఎమ్మెల్యేలు హాజరవ్వడం చర్చకు దారితీస్తోంది.
 
ఎక్కడెక్కడో ఉన్న ఎమ్మెల్యేలందరూ వెంటనే సమావేశానికి తరలిరావాలని పళణిస్వామి, పన్నీరుసెల్వంలు చెప్పడంతో అందరూ వరుసగా క్యూకట్టారు. ఎమ్మెల్యేలు తమ పేర్లను చెబుతూ సంతకాలు కూడా చేసేశారు. మొత్తం 109 మంది ఎమ్మెల్యేలు. ప్రభుత్వం ఉండాలంటే 117మంది ఎమ్మెల్యేల అవసరం ఉంటుంది. అయితే మరో 9మంది ఎమ్మెల్యేలు తనకు టచ్‌లో ఉన్నారన్న ధీమాలో ఉన్నారు పళణి. 
 
టచ్‌లో ఉన్న ఎమ్మెల్యేలు దినకరన్ శిబిరంలో ఉన్న వారేనని పళణి చెబుతున్నారు. అంతేకాదు తమిళనాడులో ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. వారు పళణికే మద్దతట. ఆ విషయాన్ని ఆయనే చెబుతున్నాడు. నా ప్రభుత్వానికి ఢోకానే లేదు. నేను పూర్తికాలం సిఎంగా కొనసాగుతానంటూ పళని స్వామి, సహచర సీనియర్ మంత్రులతో ధీమాగా చెబుతున్నారట. ఆయన ఓవర్ కాన్ఫిడెన్స్ చూస్తున్న నేతలు ఆశ్చర్యపోతున్నారట. ఎర్త్ ఎప్పుడైనా పెట్టే పరిస్థితి వున్నప్పుడు పళనిస్వామి ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే మరి.