సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 6 జూన్ 2023 (10:00 IST)

తమిళనాడు జైలు ఖైదీలకు గుడ్ న్యూస్.. మెనూలో చికెన్ గ్రేవీ

chicken
తమిళనాడు జైలు ఖైదీలకు గుడ్ న్యూస్. వారికి అందించే ఆహారంలో మెనూ మార్చనున్నారు. తమిళనాడులోని జైలు ఖైదీలకు ఇప్పటివరకు రోజుకు ఒక ఖైదీకి 96 రూపాయలు మాత్రమే ఖర్చవుతుండగా, ఇప్పుడు దానిని 135 రూపాయలకు పెంచుతూ ప్రకటన విడుదల చేశారు.
 
కొత్త మెనూ ప్రకారం తమిళనాడులోని జైలు ఖైదీలకు ఉదయం పొంగల్, ఉడికించిన కోడిగుడ్లు, మధ్యాహ్నం చికెన్ గ్రేవీ, సాయంత్రం వేడివేడి శెనగలు, రాత్రి చపాతీ చెన్నా వడ్డిస్తారు. 
 
తమిళనాడు జైలు ఖైదీల కోసం కొత్త మెనూ మార్చాలని.. చాలా సంవత్సరాలుగా డిమాండ్ వస్తోంది. ఈ నేపథ్యంలో ఖైదీల మెనూను ప్రస్తుత సర్కారు మార్పు చేసింది.