శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : శనివారం, 13 మే 2017 (11:21 IST)

బస్సులో పోకిరి అసభ్యంగా ప్రవర్తించాడని.. ఆ అమ్మాయి ఏం చేసిందో తెలుసా?

బస్సులో ఓ పోకిరి అసభ్యంగా ప్రవర్తిస్తే ఆ అమ్మాయి ఏం చేసిందో తెలుసా? అయితే ఈ కథనం చదవండి. యువతులకు రక్షణగా బెంగళూరు పోలీసులు ఇటీవల 'Know your police station' (మీ పరిధిలోని పోలిస్ స్టేషన్ తెలుసుకోండి) అ

బస్సులో ఓ పోకిరి అసభ్యంగా ప్రవర్తిస్తే ఆ అమ్మాయి ఏం చేసిందో తెలుసా? అయితే ఈ కథనం చదవండి. యువతులకు రక్షణగా బెంగళూరు పోలీసులు ఇటీవల 'Know your police station' (మీ పరిధిలోని పోలిస్ స్టేషన్ తెలుసుకోండి) అనే యాప్‌ను ప్రారంభించారు. ఆ యాప్ ద్వారా కేవలం 15 నిమిషాల్లోనే  బస్సులో అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తిని పోలీసులకు పట్టించిన ఆ యువతి అందరితో శభాష్ అనిపించుకుంది.  
 
బస్సులోని వారికి ఆ పోలీసులు ఎందుకు వచ్చారో, అతడిని ఎందుకు అదుపులోకి తీసుకుంటున్నారో అర్థం కాలేదు. ఆ తరువాత తెలుసుకొని పోకిరీని పట్టించిన యువతిని అభినందించారు. ఆ అమ్మాయి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తి మధుసూదన్ రావు (47) అని అతనో టెక్కీ అని పోలీసులు వెల్లడించారు. ఇకనుంచైనా అమ్మాయిలకు పోకిరీల నుండి వేధింపులు మొదలైతే ఇలాంటి సాంకేతిక విజ్ఞానాన్నే వాడుకొని వారి ఆట కట్టించాలని పోలీసులు సూచిస్తున్నారు.