గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం

పోర్టబిలిటీ సేవలకు తాత్కాలిక బ్రేక్‌

మొబైల్‌ నంబరు మారకుండానే సెల్‌ఫోన్‌ ఆపరేటర్‌ను మార్చేలా వెసులుబాటు కల్పించే పోర్టబిలిటీ సేవలకు తాత్కాలికంగా బ్రేక్‌ పడనుంది. 
 
వచ్చేనెల 4 నుంచి 10వ తేదీ వరకు మొబైల్‌ నంబర్‌ పోర్టబిలిటీ (ఎంఎన్‌పీ) సేవలను నిలిపివేస్తూ భారత టెలికం నియంత్రణ సంస్థ (ట్రాయ్‌) శనివారం ఆదేశాలు జారీ చేసింది. 
 
నవంబరు 11 నుంచి ఎంఎన్‌పీలో కొత్త విధానం రానున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. పాత విధానంలో ఆపరేటర్‌ మార్పునకు వినియోగదారులు వారం రోజులు ఎదురుచూడాల్సి వచ్చేది. కొత్తవిధానంలో అది రెండు రోజుల్లో పూర్తికానుంది.