1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 10 నవంబరు 2023 (13:00 IST)

వ్యభిచార గృహం నడిపిన 17 ఏళ్ల బాలిక అరెస్ట్.. ఎక్కడ?

sex racket
వ్యభిచార గృహం నడుపుతున్న 17 ఏళ్ల బాలికను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందుకోసం పోలీసులు ప్రత్యేక ఆపరేషన్‌ చేపట్టారు. ముంబైలోని అంధేరీలో ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తున్న 17 ఏళ్ల యువతి కొంతకాలంగా వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తోంది. అయితే ఈ విషయం ఆమె తల్లిదండ్రులకు తెలియదు. 
 
అయితే ఆ అమ్మాయి నవీ ముంబైలో నలుగురు మోడల్స్‌తో వ్యభిచారం చేసేది. వచ్చిన డబ్బులో కొంత ఆ మోడళ్లకు ఇచ్చి మిగతాది తమ వద్దే ఉంచుకునేది. దీనిపై పోలీసులకు అనుమానం వచ్చింది. ఈ కేసును ఛేదించాలని నిర్ణయించుకున్న పోలీసులు ప్రత్యేక ఆపరేషన్‌ చేపట్టారు. చివరకు బాలిక పట్టుబడింది.
 
అమ్మాయితో నలుగురు మోడల్స్ ఉన్నారు. వీరి వయసు 20, 21, 24, 30 సంవత్సరాలే. వీరు సీరియల్స్‌లో చిన్న చిన్న పాత్రలు చేసేవారు. చాటింగ్ ద్వారా పోలీస్ అధికారి అని తెలియక కస్టమర్ అనుకుని చిక్కుకున్నట్లు విచారణలో తేలింది. ఒక్కొక్కరికి రూ.50వేల చొప్పున విటులు చెల్లించేవారని తెలిసింది. ఈ ఘటనపై కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.