శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : బుధవారం, 29 మే 2019 (16:31 IST)

ఆ గదిలో ఫ్యానుకు రహస్య కెమెరాలు.. కనుగొన్న ఆ జంట ఏం చేసిందంటే?

ఉత్తరాఖండ్‌కు విహారయాత్ర కోసం వెళ్లిన ఓ జంటకు షాక్ తప్పలేదు. అక్కడ ఆ దంపతులు బస చేసిన హోటల్‌ గదిలో రహస్య కెమెరాలు వుండటం గమనించి షాక్ తిన్నారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటనపై రంగంలోకి దిగిన పోలీసులు హోటల్ యజమానికి అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. డెహ్రాడూన్, తెహ్రీ జిల్లాలోని ఓ హోటల్‌లో దంపతులు దిగారు. 
 
ఆ హోటల్‌లోని ఓ గదిలో బస చేశారు. అయితే ఆ దంపతులు బస చేసిన హోటల్ ఫ్యానులో రహస్య కెమెరాలనుండటం ఆ దంపతులు గమనించారు. దీనిపై హోటల్ యాజమాన్యానికి చెప్పినా పెద్దగా ఎవ్వరూ పట్టించుకోలేదు. ఇక లాభం లేదనుకున్న ఆ జంట పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇంకా దంపతుల ఫిర్యాదు మేరకు పోలీసులు హోటల్ యజమానిని అరెస్ట్ చేసి.. రహస్య కెమెరాలు, సెల్‌ఫోన్, ల్యాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకున్నారు.