గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 29 డిశెంబరు 2022 (17:45 IST)

కాటేసిన పాముతో ఆస్పత్రికి వెళ్లిన యువకుడు.. షాకైన సిబ్బంది

snake
కాటేసిన పాముతో ఆస్పత్రికి వెళ్లాడు ఓ యువకుడు. ఈ ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. పాము కాటు వేస్తే ఆ పామును ఆస్పత్రికి తీసుకెళ్లిన యువకుడిని చూసి జనం పరుగులు పెట్టారు. వివరాల్లోకి వెళితే.. కర్ణాటక, చిక్కమగళూరులో తరికెరె నగరంలో ఓ యువకుడు భిన్నంగా ఆలోచించాడు.
 
తనను కరిచిన పాము ఆస్పత్రికి తీసుకెళ్లాడు. ఇతడు కోల్ కతాకు చెందిన ఆసిఫ్ అని తెలిసింది. జాతీయ రహదారి నిర్మాణ పనులు చేసేందుకు కర్ణాటక వచ్చాడు. అయితే స్వగ్రామానికి తిరిగి వెళ్లేందుకు రైల్వే స్టేషన్ చేరుకున్నాడు. 
 
వెంటనే ఆస్పత్రికి వెళ్లమని స్థానికులు సూచించారు. కానీ అతడు మాత్రం తనను కాటేసిన పామును చేతిలో పట్టుకుని ఆస్పత్రికి వెళ్లాడు. చేతిలో పాము ఉండడం చూసి ఆస్పత్రి సిబ్బంది షాకయ్యారు. అనంతరం ఆసిఫ్‌కు చికిత్స అందించారు.