గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 18 మే 2023 (10:10 IST)

రెండేళ్ల పెద్ద... అయినా టీచర్‌ను ప్రేమించాడు.. నో చెప్పేసరికి.. కత్తితో..?

crime scene
తనకంటే రెండేళ్లు పెద్ద అయిన టీచర్‌ని ఓ వ్యక్తి ప్రేమించాడు. అయితే ఆ ప్రేమను ఆమె అంగీకరించలేదు. దీంతో ఆగ్రహానికి గురైన ఆ వ్యక్తి తన స్నేహితుడితో కలిసి కత్తితో పొడిచేశాడు. ఈ ఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్‌‌ అజ్మీర్ నివాసి కీర్తి సోని (32). ఆ ప్రాంతంలోని ఓ ప్రైవేట్‌ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. 
 
వివేక్ సింగ్ (30) అనే వ్యక్తి ఆమెను ప్రేమిస్తున్నానని వేధించాడు. తన ప్రేమను టీచర్‌కు పలుమార్లు చెప్పగా, టీచర్ సోని అతడి ప్రేమను అంగీకరించలేదు. ఈ విషయాన్ని టీచర్ సోని తన స్నేహితుడు అనిల్‌కు చెప్పింది. తరువాత, ఇద్దరూ కలిసి వివేక్‌ని ఒక కేఫ్‌కి పిలిచారు. ఎంత మాట్లాడినా వివేక్ తీరు మారలేదు. 
 
టీచర్ కూడా తాను వివేక్‌ను ప్రేమించేది లేదని స్పష్టం చేసింది. దీంతో ఆగ్రహానికి గురైన వివేక్ తాను దాచుకున్న కత్తితో టీచర్ సోనిని పలుమార్లు పొడిచాడు. దీంతో సోనీ అక్కడికక్కడే కుప్పకూలింది. 
 
వెంటనే ఆమెను అనిల్ రక్షించి ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది. దాడికి పాల్పడిన వివేక్ పరారీలో ఉన్నాడని, అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.