ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్

కర్నాటకలో బీజేపీ సర్కారు పతనం : కుమార స్వామి జోస్యం

మరో రెండు నెలల్లో కర్నాటకలోని బీజేపీ సర్కారు పతనం కావడం ఖాయమన ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామి జోస్యం చెప్పారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి బీఎస్‌ యడియూరప్ప సర్కార్‌ రెండు నెలల్లో పతనం కాకతప్పదన్నారు. 
 
బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా భయపడే ప్రసక్తే లేదన్నారు. తను అభివృద్ధి కోసం మాత్రమే తల వంచుతానన్నారు. ఇదీ ఇప్పటికి నిర్వహిస్తున్న ధర్నా మాత్రమేనని, ప్రభుత్వంలో మార్పు రాకుంటే వచ్చే రోజుల్లో విధానసౌధను కూడా ముట్టడిస్తామన్నారు. శికారిపురకు సీఎం బీఎస్‌ యడియూరప్ప రూ. 800 కోట్లను విడుదల చేశారు.
 
అయితే తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్ని నియోజకవర్గాలకు సమానంగా నిధులను విడుదల చేసినట్లు కుమార గుర్తు చేశారు. ఇది ఒక విధంగా సిగ్గులేని ప్రభుత్వామని ఎదురుదాడి చేశారు. వరదలతో రెండన్నర లక్షల మంది నిరాశ్రయులైతే వారికి సాయం అందించటంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు.