గురువారం, 9 అక్టోబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 7 అక్టోబరు 2025 (14:53 IST)

టిక్కెట్ లేకుండా రైలెక్కి ... టీసీపైనే ఎదురుదాడి చేసిన మహిళ (వీడియో)

woman passenger
టిక్కెట్ లేకుండా రైలు ఎక్కిన ఓ మహిళ టీసీతోనే వాగ్వాదానికి దిగింది. టీసీపై ఎదురు దాడి చేయడంతో పాటు తనను వేధిస్తున్నాడంటూ ఆరోపించింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. 
 
ఓ మహిళ టిక్కెట్ లేకుండా రైలులో ఏసీబోగీలో కూర్చొంది. ఇంతలో అక్కడకు వచ్చిన టీసీ... టిక్కెట్ చూపించాలని కోరగా, తాను టిక్కెట్ తీసుకోలేదని ఆ మహిళ చెప్పింది. దీంతో ఏసీ నుంచి జనరల్ క్లాస్‌కు వెళ్లాలని ఆ మహిళకు టీసీ సూచించారు. 
 
అయినా సరే ఆ మహిళ ఏమాత్రం వినిపించుకోకుండా నన్ను వేధిస్తున్నారు అంటూ టీసీపైకి ఎదురుదాడికి దిగింది. ఆయనను అసభ్య పదజాలంతో దుర్భాషలాడింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు నెట్టింట వైరల్ అవుతోంది.