మంగళవారం, 18 నవంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 7 అక్టోబరు 2025 (11:35 IST)

కాకినాడలో లారీని ఓవర్ టేక్ చేయబోయి.. లారీ కింద పడ్డాడు.. ఆ తర్వాత ఏం జరిగింది? (video)

Concrete mixer lorry
Concrete mixer lorry
కాకినాడలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. కాకినాడలో స్కూటీపై వెళ్తున్న మనిషికి లారీ రూపంలో చుక్కలు కనిపించాయి. కాంక్రీట్ మిక్సర్ లారీని ఓవర్ టేక్ చేయబోయిన అతనికి దేవుడు కనిపించాడు. ఓవర్ టేక్ చేస్తూ లారీ ముందు నరేందర్ అనే వ్యక్తి పడ్డాడు. అంతే లారీ అతనిపైనే నడిచింది. 
 
కానీ అదృష్టవశాత్తు టైర్ల మధ్యలో పడటంతో ప్రాణాలతో బయటపడ్డాడు. దీంతో తృటిలో ప్రాణాలతో బయటపడి మృత్యువును జయించాడు. అయితే ఈ ఘటనలో నరేందర్‌ గాయపడినట్లు తెలుస్తోంది. లారీ వెళ్లిన తర్వాత చాలాసేపటికి అతని ఆ ప్రాంతం నుంచి కదల్లేకపోయాడు. 
 
ఆపై ఓ బైకర్ సాయంతో అతను లేచి నిలబడినట్లు వీడియోలో తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసినవారంతా ఆ వ్యక్తి ఈ ప్రమాదంలో మృత్యుంజయుడిగా బయటపడ్డాడని, అతనికి భూమి మీద ఇంకా నూకలు వున్నాయని కామెంట్లు చేస్తున్నారు.