శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By జెఎస్కె
Last Modified: శుక్రవారం, 30 జులై 2021 (13:26 IST)

రూ.30 ల‌క్ష‌ల‌కు పులి చ‌ర్మం బేరం

పులి చ‌ర్మం తెచ్చి ఇస్తే... 30 ల‌క్ష‌ల రూపాయ‌లు ఇస్తామ‌ని బేరం కుదుర్చుకున్నారు. దానికి ప‌ట్టుకుని ర‌వాణా చేస్తుండ‌గా, నిందితులు పోలీసుల‌కు ప‌ట్టుబ‌డ్డారు. తెలంగాణాలోని ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం ముల్లకట్ట గోదావరి వంతెన వద్ద పులి చర్మం తరలిస్తున్న ఇరువురిని పోలీసులు పట్టుకున్నారు.

వారి వద్ద నుంచి పులి చర్మంతో పాటు ద్విచక్రవాహనం, మొబైల్‌ను స్వాధీనం చేసుకున్నారు. చత్తీస్‌గడ్‌కు చెందిన సాగర్ అనే వ్యక్తి ద్వారా పులి చర్మాన్ని సేకరించిన వాజేడుకు చెందిన తిరుమలేష్ చత్తీస్‌గడ్‌కు చెందిన సత్యం అనే వ్యక్తి సహాయంతో రూ.30 లక్షలకు విక్రయించేందుకు బేరం కుదుర్చుకున్నారు.

ఈక్రమంలో పులి చర్మాన్ని తరలిస్తుండగా ఏటూరునాగారం పోలీసులు పట్టుకున్నారు. వారిపై అటవీ సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ సంఘనతో సంబంధమున్న మిగతవారిని పట్టుకుంటామని ఎస్పీ సంగ్రాంసింగ్ తెలిపారు.

ఏటూరు నాగారం ఏఎస్పీ గౌష్ ఆలం ఐపీఎస్, శివ ఆశిష్ సింహం ఐఎఫ్ఎస్, స్పెషల్ ఆఫీసర్ ఏటూరునాగారం ప్రశాంత్ పాటిల్, సీఐ ఏటూరునాగారం కిరణ్ ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి, శ్యాం ప్రసాద్ అటవీశాఖ సిబ్బంది ఈ సంద‌ర్భంగా పాల్గొన్నారు.