గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎంజీ
Last Updated : మంగళవారం, 31 ఆగస్టు 2021 (09:35 IST)

చరిత్రలో ఈరోజు ...ఆగస్టు 31

ఆగస్టు 31వ తేదీకి చరిత్రలో ఎంతో విశిష్టత వుంది. ఎంతోమంది గొప్ప వ్యక్తుల జననం, మరెన్నో ఘటనలకు కారణమైంది. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం.
 
జననాలు:
1864: ఆదిభట్ల నారాయణదాసు, హరికథా పితామహుడ (మ.1945).
1923: చెన్నమనేని రాజేశ్వరరావు, విద్యార్థి దశలోనే జాతీయోద్యమంలోనూ, నిరంకుశ నిజాం వ్యతిరేక ఉద్యమంలోనూ పాల్గొన్నారు (మ.2016).
1925: ఆరుద్ర, కవి, గేయరచయిత, సాహితీవేత్త, కథకుడు, నవలారచయిత, విమర్శకుడు, పరిశోధకుడు, అనువాదకుడు (మ.1998).
1932: రావిపల్లి నారాయణరావు, 80 కథలు రాశారు. 'పెళ్ళాడి ప్రేమించు' అనే కథా సంపుటి తెలుగు వారికందించారు.
1934: రాజశ్రీ, సినిమా పాటల రచయిత. (మ.1994)
1936: తురగా జానకీరాణి, రేడియోలో పాటలు, నాటికలు, రూపకాలు వంటి ఎన్నో కార్యక్రమాలను రూపొందించి, చిన్నారులతో ప్రదర్శింపచేశారు. (మ.2014).
1944 : వెస్ట్‌ఇండీస్ కు చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు క్లైవ్ లాయిడ్ జననం
1962: మల్లిపూడి మంగపతి పళ్ళంరాజు, 14వ లోక్‌సభ సభ్యుడు.
1969: జవగళ్ శ్రీనాథ్, భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు.
1975 : ఉడతా రామకృష్ణ, సదా మీకోసం పత్రిక సంపాదకులు జననం.
 
మరణాలు:
1997: ప్రిన్సెస్ డయానా, బ్రిటన్ యువరాజు ప్రిన్స్ చార్లెస్ మాజీ భార్య (జ.1961).
2014: బాపు, చిత్రకారుడు, సినీ దర్శకుడు (జ.1933).
2020 : భారతదేశ 13వ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరణం.(జ.1935)