బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 27 జులై 2021 (08:42 IST)

చరిత్రలో ఈరోజు (జులై 27)

సంఘటనలు:
1929: జెనీవా కన్వెన్‌షన్ యుద్ధ ఖైదీలకు సంబంధించిన విధివిధానాలను 53 దేశాలు కలిసి రూపొందించాయి.
 
1957: అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ఏర్పాటైంది.
 
జననాలు:
 
1911: సంగం లక్ష్మీబాయి, స్వాతంత్ర్య సమరయోధురాలు, భారత లోక్ సభ సభ్యురాలు. (మ.1979)
 
1935: వెలుదండ రామేశ్వరరావు, ఆయుర్వేద, హోమియోపతి వైద్య విధానాలలో ఈయనది అందే వేసిన చెయ్యి. ఈయన చాలా రచనలు చేశారు. వాటిలో కొన్ని ముద్రితం, కొన్ని అముద్రితం.
 
1948: ఎం. వి. ఎస్. హరనాథ రావు, నాటక రచయిత, సినీ మాటల రచయిత, నటుడు. (మ.2017)
 
1955: అలాన్ బోర్డర్, ఆస్ట్రేలియా మాజీ క్రికెట్ కెప్టెన్.
 
1960: సాయి కుమార్, తెలుగు సినిమా నటుడు, డబ్బింగ్ కళాకారుడు.
 
1963: కె. ఎస్. చిత్ర, మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, ఒరియా, హిందీ, అస్సామీ, బెంగాలీ భాషల సిని నేపథ్య గాయని.
 
1953: కత్తి పద్మారావు, రచయిత, సంఘ సంస్కర్త.
 
మరణాలు:
1936: అయ్యల సోమయాజులు గణపతిశాస్త్రి, పండితుడు, జ్యోతిష్యుడు, ఆధ్యాత్మికవేత్త. (జ.1878)
 
1970: పి.ఏ.థాను పిళ్లై, భారత స్వాతంత్ర్య సమరయోధుడు. (జ.1885)
 
2003: ఆవుల సాంబశివరావు, న్యాయవాది, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, రాష్ట్ర మొట్టమొదటి లోకాయుక్త, హేతువాది, ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్. (జ.1917)
 
2015: ఏ.పి.జె.అబ్దుల్ కలామ్, అంతరిక్ష శాస్త్రవేత్త, భారత మాజీ రాష్ట్రపతి (జ.1931)