శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 2 ఫిబ్రవరి 2017 (17:43 IST)

బీహార్‌లో గుర్తు తెలియని వ్యాధితో చిన్నారుల మృతికి.. లిచీ పండే కారణమట..

బీహార్‌లో చిన్నారులు గత కొన్నేళ్లుగా గుర్తు తెలియని వ్యాధితో ప్రాణాలు కోల్పోవడానికి అసలు కారణం ఏమిటో తెలియవచ్చింది. జ్వరం, స్పృహ కోల్పవడం వంటి లక్షణాలతో చిన్నారులు మృత్యువాత పడటం బీహార్‌లో ఎక్కువైంది.

బీహార్‌లో చిన్నారులు గత కొన్నేళ్లుగా గుర్తు తెలియని వ్యాధితో ప్రాణాలు కోల్పోవడానికి అసలు కారణం ఏమిటో తెలియవచ్చింది. జ్వరం, స్పృహ కోల్పవడం వంటి లక్షణాలతో చిన్నారులు మృత్యువాత పడటం బీహార్‌లో ఎక్కువైంది. అయితే ఈ మరణాలకు లిచీ పండే కారణమని శాస్త్రవేత్తలు అంటున్నారు. లిచీ అనే పండును తినడం వల్లే నారాల సంబంధిత వ్యాధితో చిన్నారులు మరణిస్తున్నట్లు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. 
 
ఈ పండులో ఉన్న హైపోగ్లైసిన్ ఏ లేదా మెథిలినీసైక్లోప్రొఫిల్‌గ్లైసిన్ లాంటి సహజమైన విషపూరిత రసాయనాలు చిన్నారుల ప్రాణాలు తీస్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్‌, యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సంస్థలకు చెందిన పరిశోధకులు ఈ విషయాన్ని కనిపెట్టారు. ముజాఫర్ జిల్లాకు చెందిన 15 ఏళ్ల లోపు ఇద్దరు యువకులపై జరిపిన పరిశోధన ఆధారంగా శాస్త్రవేత్తలు ఈ నిర్ధారణకు వచ్చినట్లు శాస్త్రవేత్తలు చెప్తున్నారు.  
 
ఈ పండ్లు తినడం వల్లే చిన్నారుల శరీర భాగాలు వంకర్లు పోవడం, కోమాలోకి పోవడం జరుగుతోందని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఈ పండ్లలో విషపూరిత పదార్థాలున్నట్లు వారు చెబుతున్నారు. కాగా, ఈ వ్యాధి బారిన పడ్డ 390మంది చిన్నారుల్లో 122మంది ప్రాణాలు కోల్పోయారు. అందుకే చిన్నారులు లిచీ పండ్లను తినొద్దని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.