ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 22 ఫిబ్రవరి 2023 (19:25 IST)

ఎమిరేట్స్ ఫ్లైట్ మీల్‌లో వెంట్రుక.. తృణమూల్ ఎంపీ మిమీ చక్రవర్తి ఫైర్

Mimi Chakraborty
Mimi Chakraborty
తృణమూల్ ఎంపీ మిమీ చక్రవర్తి ఎమిరేట్స్ ఫ్లైట్ మీల్‌లో వెంట్రుకలపై ఫిర్యాదు చేశారు. దీనిపైఎయిర్‌లైన్ స్పందించింది. నటిగా మారిన రాజకీయ నాయకురాలు చక్రవర్తి తనకు వడ్డించిన క్రోసెంట్‌లో వెంట్రుకలు ఉన్నాయని ఫిర్యాదు చేసింది. 
 
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మిమీ చక్రవర్తి మంగళవారం ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్‌పై మండిపడ్డారు. నటిగా మారిన రాజకీయ నాయకురాలు చక్రవర్తి తనకు వడ్డించిన క్రోసెంట్‌లో వెంట్రుకలు ఉన్నాయని ఫిర్యాదు చేసింది. అలాగే ఈ ఘటనకు సంబంధించిన చిత్రాలను కూడా ట్విట్టర్‌లో షేర్ చేసింది. 
 
ఎయిర్‌లైన్స్ ప్రతినిధులకు మెయిల్ చేసినప్పటికీ, బృందం నుండి ఎటువంటి స్పందన లేదా క్షమాపణలు రాలేదని మిమీ చక్రవర్తి ట్వీట్ చేసింది. 
 
సంబంధిత విమాన సర్వీసు ప్రతినిధులకు తాను ఇప్పటికే అన్ని వివరాలను మెయిల్ చేసినట్లు మిమీ చక్రవర్తి పేర్కొంది. మరో ట్వీట్‌లో, ''మీరు శ్రద్ధ వహిస్తే అన్ని వివరాలతో నా మెయిల్‌ను కనుగొనవచ్చు'' అని రాసింది.