శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : సోమవారం, 5 ఫిబ్రవరి 2018 (16:23 IST)

అమ్మవారికి చుడీదార్ అలంకరణ.. పూజారులపై వేటు.. ఎక్కడ?

తమిళనాడులోని నాగై జిల్లాలో అమ్మవారికి పట్టువస్త్రాలంకరణను పక్కనబెట్టి శాస్త్రాలకు విరుద్ధంగా చుడీదార్ వస్త్రంతో అలంకరించిన పూజారులు సస్పెన్షన్‌కు గురయ్యారు. కాశీకి సమానమైన ఆలయంగా పేరున్న శివాలయాల్లో

తమిళనాడులోని నాగై జిల్లాలో అమ్మవారికి పట్టువస్త్రాలంకరణను పక్కనబెట్టి  శాస్త్రాలకు విరుద్ధంగా చుడీదార్ వస్త్రంతో అలంకరించిన పూజారులు సస్పెన్షన్‌కు గురయ్యారు. కాశీకి సమానమైన ఆలయంగా పేరున్న శివాలయాల్లో మయిలాడుదురైలోని శివాలయం ఒకటి. ఇక్కడ అమ్మవారు నెమలి రూపంలో పరమేశ్వరుడిని పూజించినట్లు పురాణాలు చెప్తున్నాయి.
 
ఈ నేపథ్యంలో మయిలాడుదురైలోని మయూరనాధ ఆలయంలో అభయాంబికగా వెలసిన అమ్మవారికి చుడీదార్ అలంకరణ చేశారు... పూజారులు. ఈ ఆలయంలోని అమ్మవారు చుడీదార్ అలంకరణలో భక్తులు దర్శనమివ్వడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇక అమ్మవారికి చుడీదార్ అలంకరణ చేసిన పూజారులు రాజ్, కల్యాణం అనే ఇద్దరిని ఆలయ నిర్వాహకులు సస్పెండ్ చేశారు.