మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : బుధవారం, 19 సెప్టెంబరు 2018 (13:18 IST)

ట్రిపుల్ తలాక్‌ ఆర్డినెన్స్‌కు మోదీ సర్కారు ఆమోదం

ట్రిపుల్ తలాక్‌పై కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ట్రిపుల్ తలాక్ విధానం ద్వారా భార్యకు విడాకులు ఇవ్వడాన్ని శిక్షించదగిన నేరంగా మారుస్తూ.. ఆర్డినెన్స్ తెచ్చేందుకు అంగీకరించింది

ట్రిపుల్ తలాక్‌పై కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ట్రిపుల్ తలాక్ విధానం ద్వారా భార్యకు విడాకులు ఇవ్వడాన్ని శిక్షించదగిన నేరంగా మారుస్తూ.. ఆర్డినెన్స్ తెచ్చేందుకు అంగీకరించింది. 
 
ఈ మేరకు బుధవారం సమావేశమైన క్యాబినెట్ ఆర్డినెన్స్‌కు ఆమోదం ఇచ్చింది. ట్రిపుల్ తలాక్ బిల్లు అటు లోక్ సభలోనూ, ఇటు రాజ్యసభలోనూ ఆమోదం పొందడంలో విఫలమైన నేపథ్యంలోనే, ఆర్డినెన్స్ తేవాలని మోదీ క్యాబినెట్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.
 
ఈ బిల్లును మరోసారి పరిశీలించేందుకు సెలక్ట్ కమిటీకి పంపాలని పలు విపక్ష పార్టీలు డిమాండ్ చేయడంతో బిల్లు చర్చల దశలోనే ఆగిపోయిన సంగతి తెలిసిందే. కానీ ట్రిపుల్ తలాక్‌ శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తూ రూపొందించిన ఆర్డినెన్స్‌కు కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోద ముద్ర వేసింది. రాష్ట్రపతి ఆమోద ముద్ర పొందగానే ఈ ఆర్డినెన్స్ అమల్లోకి రానుంది.