సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : ఆదివారం, 22 ఏప్రియల్ 2018 (16:03 IST)

అత్యాచారానికి పాల్పడితే ఉరిశిక్ష.. ఆర్డినెన్స్‌పై రాష్ట్రపతి సంతకం.. సంతోష్ ఏమన్నారంటే?

కథువా, ఉన్నావో ఘటనలు పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాలు, సినీ తారలు డిమాండ్ చేశారు. ఇందుకోసం పోరాటాలను ఉధృ

కథువా, ఉన్నావో ఘటనలు పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాలు, సినీ తారలు డిమాండ్ చేశారు. ఇందుకోసం పోరాటాలను ఉధృతం చేశారు. దీంతో కేంద్రం దిగొచ్చింది. చిన్నారులపై అఘాయిత్యానికి పాల్పడే వారికి ఉరిశిక్ష విధించేలా ఆర్డినెన్స్ తెచ్చింది.
  
 
ఇలా కేంద్ర మంత్రి వర్గం రూపొందించిన ఆర్డినెన్స్‌కు రాష్ట్రపతి ఆమోదం కూడా లభించింది. 12 ఏళ్లలోపు వారిపై అత్యాచారం చేసే నిందితులకు మరణశిక్ష విధించే ఆర్డినెన్స్‌పై రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సంతకం చేశారు. కేంద్ర కేబినెట్ శనివారం అత్యవసరంగా సమావేశమై ''ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్యువల్ అఫెన్సెస్ (పోస్కో)'' చట్టానికి సవరణలు చేస్తూ ఆర్డినెన్స్‌ను ఆమోదించిన విషయం తెలిసిందే. చిన్నారులపై అత్యాచారం చేసే వారికి గరిష్టంగా మరణశిక్షతోపాటు మరెన్నో కఠిన శిక్షల్ని ప్రతిపాదించారు. అనంతరం దీన్ని రాష్ట్రపతికి పంపగా ఆయన కూడా వేగంగా దీనికి అనుమతి తెలిపారు.
 
ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి సంతోష్ గంగ్వార్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. ఇంత పెద్ద దేశంలో ఏవో ఒకటి రెండు అత్యాచార కేసులు జరిగితే వాటిని మరీ అంత పెద్దవి చేసి రాద్ధాంతం చేయడం సరికాదన్నారు. అత్యాచారాలు దురదృష్టకరం. అయినప్పటికీ కొన్ని సమయాల్లో మనం వాటిని ఆపలేం. ప్రభుత్వం అంతటా అప్రమత్తతతోనే ఉంటోందని తెలిపారు. ఇంత పెద్ద దేశంలో ఒకటి రెండు అత్యాచారాలు జరిగితే వాటిని అంత పెద్దవి చేయకూడదని గంగ్వార్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి.