శనివారం, 16 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : గురువారం, 8 జూన్ 2017 (18:25 IST)

రైతులపై కాల్పులు.. కలెక్టర్‌ను బదిలీ చేశాం : వెంకయ్య నాయుడు

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో రైతులపై జరిపిన కాల్పుల వ్యవహారానికి సంబంధించి ఎస్పీ, కలెక్టర్‌ను బదిలీ చేశారని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు చెప్పుకొచ్చారు. ఇదే అంశంపై ఆయన విలేకరులతో మాట్లాడుతూ... మధ్యప్రదేశ్ లో

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో రైతులపై జరిపిన కాల్పుల వ్యవహారానికి సంబంధించి ఎస్పీ, కలెక్టర్‌ను బదిలీ చేశారని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు చెప్పుకొచ్చారు. ఇదే అంశంపై ఆయన విలేకరులతో మాట్లాడుతూ... మధ్యప్రదేశ్ లో రైతుల మృతిని కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. 
 
బీజేపీ రైతు వ్యతిరేకి అని కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తోందని, గతంలో ఎన్నడూ లేనివిధంగా దేశంలో రైతులకు పది లక్షల కోట్ల రుణాలిచ్చామని, తక్కువ ప్రీమియంతో ఎక్కువ బీమా వచ్చేలా పథకం తీసుకొచ్చామని, సాగునీటి ప్రాజెక్టుల కోసం రూ.50 వేల కోట్లు మంజూరు చేశామని ఆయన గుర్తు చేశారు. 
 
అదేసమయంలో గిట్టుబాటు ధర కోసం ఆందోళన చేస్తున్న రైతులపై కాల్పులు జరగడం బాధాకరమని, ఈ ఘటనకు సంబంధించి ఎస్పీ, కలెక్టర్‌ను బదిలీ చేశారని, రైతులపై కాల్పుల ఘటనపై న్యాయ విచారణ జరుగుతోందని వెంకయ్యనాయుడు అన్నారు. రైతులతో ఫొటోలు దిగేందుకే రాహుల్ గాంధీ మధ్యప్రదేశ్ పర్యటన పెట్టుకున్నారని వెంకయ్య ఎద్దేవా చేశారు.