శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 7 జులై 2017 (14:25 IST)

అపుడు పెళ్లి కాకుండానే తల్లి అయింది.. ఇపుడు అవివాహితగా ప్రకటించాలని కోర్టుకెక్కింది!

బిడ్డకు తల్లి అయిన ఓ మహిళ... తనను అవివాహితగా ప్రకటించాలని కోరుతూ కోర్టుకెక్కింది. పైగా, కుమార్తె పుట్టిన తేదీ రికార్డుల నుంచి తండ్రిపేరును తొలగించాలని కోరింది. ముంబై హైకోర్టులో దాఖలైన ఈ పిటీషన్‌లోని వ

బిడ్డకు తల్లి అయిన ఓ మహిళ... తనను అవివాహితగా ప్రకటించాలని కోరుతూ కోర్టుకెక్కింది. పైగా, కుమార్తె పుట్టిన తేదీ రికార్డుల నుంచి తండ్రిపేరును తొలగించాలని కోరింది. ముంబై హైకోర్టులో దాఖలైన ఈ పిటీషన్‌లోని వివరాలను పరిశీలిస్తే.. 
 
ముంబై పరిధిలోని బోరివలి ప్రాంతానికి చెందిన 22 ఏళ్ల యువతికి పెళ్లి కాలేదు... కానీ ఆమె గర్భవతి అయింది. దీంతో 2014వ సంవత్సరం నవంబరు నెలలో ఓ చిన్నారికి జన్మనిచ్చింది. ఇపుడు తన కూతురి జన్మదిన రికార్డుల్లో నమోదు చేసిన తండ్రి పేరును తొలగించాలని ఆమె హైకోర్టులో పిటిషన్ సమర్పించింది. దీంతో పాటు తన కూతురి జన్మదిన రికార్డుల్లో తనను వివాహితగా పేర్కొన్నారని కానీ తాను పెళ్లి చేసుకోనందువల్ల తనను అవివాహితగా చూపించాలని కోర్టును అభ్యర్థించింది. 
 
పైగా, సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం తనను సింగిల్ పేరెంట్‌గా చూపించాలని తాను బాంబే మున్సిపల్ కార్పొరేషన్ హెల్త్ ఆఫీసరుకు అఫిడవిట్ సమర్పించినా వారు తిరస్కరించారని సదరు మహిళ కోర్టులో పేర్కొంది. దీనిపై సమగ్ర నివేదిక సమర్పించాలని, మహిళ మున్సిపాలిటీకి సమర్పించిన దరఖాస్తును తమ ముందుంచాలని బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మంజులా చెల్లూర్, జస్టిస్ నితిన్ జందార్‌లతో కూడిన ధర్మాసనం ముంబై నగర పాలక సంస్థ అధికారులను ఆదేశించారు.