1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 22 మే 2023 (10:57 IST)

15 ఏళ్ల బాలికపై ఆమె ట్యూషన్ మాస్టర్ అత్యాచారం..

woman
దేశంలో మహిళలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా యూపీలో ఓ 15 ఏళ్ల బాలికపై ఆమె ట్యూషన్ మాస్టర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. యూపీలోని సహరాన్‌పూర్‌‌లో ఉంటున్న బాధిత బాలిక గురువారం ట్యూషన్‌కు వెళ్లింది. అయితే ట్యూషన్ టీచర్ బాలికను అక్కడి నుంచి ఉత్తరాఖండ్‌లోని రూర్కీకి తీసుకెళ్లాడు. అక్కడ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
ఈ విషయం ఎవరికి చెప్పొద్దని బాలికను హెచ్చరించాడు. అయితే ఇంటికి తిరిగివచ్చిన తర్వాత బాలిక కుటుంబ సభ్యులకు చెప్పింది. దీంతో బాలిక కుటుంబ సభ్యులు శనివారం సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు నిందితుడైన ట్యూషన్ టీచర్‌పై కేసు నమోదు చేశారు. ట్యూషన్ టీచర్ పరారీలో ఉన్నాడని.. అతడిని పట్టుకునేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు.