శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 26 అక్టోబరు 2018 (13:12 IST)

ఉత్తరప్రదేశ్‌లో గేదెలను అలా దొంగలించారు..

ఉత్తరప్రదేశ్‌లో గేదెలను అలా దొంగలించారు. తుపాకీలతో వచ్చి.. మారణాయుధాలతో వచ్చి గేదేలను పట్టుకెళ్లారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్ నగర్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రత్నపురి గ్రామంలోని ఓ గేదెల యజమానిని దుండగులు బెదిరించారు. దాదాపు 25 మంది తుపాకులు, మారణాయుధాలు తీసుకుని వచ్చారు. 
 
యజమానిని బంధించి, తుపాకులు ఎక్కుపెట్టి 20 లక్షల రూపాయల విలువైన గేదెలను అపహరించుకుపోయారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేపట్టారు. ఈ దపర్యాప్తులో నరేష్ కుమార్ (గేదెల యజమాని), ఆయన కుమారుడు మోహిత్‌లు ఓ డెయిరీ ఫామ్‌ను నిర్వహిస్తున్నారు.
 
దుండగులంతా, ఒక్కసారిగా లోపలికి ప్రవేశించి, వారిని బెదిరించారని, ఆపై తాము తెచ్చిన వాహనాల్లోకి గేదెలను ఎక్కించుకుని తీసుకెళ్లారు. వారివద్ద ఉన్న బైకు, రెండు మొబైల్ ఫోన్లను తీసుకెళ్లారని పోలీసులు చెప్పారు. 
 
ఈ దోపిడీ తరువాత గ్రామస్తులు ఆగ్రహంతో, రహదారులను దిగ్బంధించి రాస్తారోకో చేశారని, పరిస్థితి అదుపు తప్పకుండా బందోబస్తును పెట్టామని వెల్లడించారు. దొంగలను పట్టుకునేందుకు తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.