గురువారం, 5 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 26 డిశెంబరు 2016 (13:14 IST)

వాట్సాప్‌లో వేధింపులు.. వ్యక్తి సూసైడ్.. భార్యను రైలు పట్టాల మీద నుంచి పక్కకు తోసేశాడు..

వాట్సాప్ ఓ వ్యక్తి ప్రాణాన్ని బలిగొంది. సోషల్ మీడియాతో లాభాన్ని పక్కనబెడితే నష్టం ఎక్కువేనని ఈ ఘటన నిరూపించింది. వాట్సాప్‌లో వచ్చిన వేధింపు సందేశాలకు మనస్తాపం చెందిన ఓ యువకుడు రైలు కిందపడి ఆత్యహత్యకు

వాట్సాప్ ఓ వ్యక్తి ప్రాణాన్ని బలిగొంది. సోషల్ మీడియాతో లాభాన్ని పక్కనబెడితే నష్టం ఎక్కువేనని ఈ ఘటన నిరూపించింది. వాట్సాప్‌లో వచ్చిన వేధింపు సందేశాలకు మనస్తాపం చెందిన ఓ యువకుడు రైలు కిందపడి ఆత్యహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని థానే కళ్యాణ్‌ ప్రాంతానికి చెందిన విశాల్‌ ఖడే ఈ నెల 22న భార్య వైష్ణవితో కలిసి రైలు పట్టాల మీద నిలబడి సెల్ఫీ తీసుకుని దాన్ని వాట్సాప్‌ ద్వారా కుటుంబసభ్యులకు పంపించాడు.
 
అయితే ఓ వ్యక్తి తమను కొంతకాలంగా వాట్సాప్ ద్వారా అసభ్యకర సందేశాలు పంపిస్తూ వేధింపులకు గురిచేస్తున్నాడని.. దీంతో మనస్తాపానికి గురైన తాము రైలు కింద పడి చనిపోతున్నట్లు చెబుతూ.. ఓ వాయిస్‌ మెసేజ్‌ని కూడా ఆ ఫొటోకు జతచేసి కుటుంబసభ్యులకు, స్నేహితులకు పంపించాడు.
 
అనంతరం ఇద్దరూ కలిసి రైలు కింద పడి చనిపోవాలని భావించిన విశాల్‌ ఆఖరి నిమిషంలో భార్యను మాత్రం రైలు పట్టాల మీద నుంచి పక్కకు తోసివేశాడు. ఈ ప్రమాదంలో విశాల్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.