మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 17 సెప్టెంబరు 2019 (10:12 IST)

అగ్రకుల అమ్మాయిని ప్రేమించాడనీ దళిత యువకుడి సజీవ దహనం

బీజేపీ పాలిత రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. అగ్రకుల అమ్మాయిని ప్రేమించాడనీ ఓ దళిత యువకుడుని సజీవ దహనం చేశారు. ఈ దృశ్యాన్ని చూసిన కన్నతల్లి... బిడ్డతో పాటు తుదిశ్వాస విడిచింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, హర్దోయి జిల్లాలోని బదేస గ్రామానికి చెందిన యువకుడు అభిషేక్ అదే గ్రామానికే చెందిన ఓ అగ్రకుల యువతిని ప్రేమిస్తూ వచ్చాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి తన ప్రియురాలిని కలిసి తన ఇంటికి వచ్చాడు. ఈ విషయాన్ని చూసిన కొందరు గ్రామస్థులు అతడిని పట్టుకుని చితకబాదారు. ఆ తర్వాత ఇంట్లో పడేసి నిప్పు అంటించారు. 
 
ఈ విషయాన్ని గుర్తించిన మరికొందరు స్థానికులు మంటలు ఆర్పి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయాడు. కుమారుడి మృతిని తట్టుకోలేక అతడి తల్లి ఏడుస్తూ అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.