మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 23 మార్చి 2022 (20:14 IST)

యూపీలో ఘోరం : చాక్లెట్లు ఆరగించిన చిన్నారులు మృత్యువాత

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. చాక్లెట్లు ఆరగించిన చిన్నారులు మృత్యువాతపడ్డారు. ఓ ఇంటి ముందు ప్లాస్టిక్ బ్యాగులో ఉన్న చాక్లెట్లు ఉండగా, వాటిని ఓ మహిళ తీసి చిన్నారులకు ఇచ్చింది. ఆ చాక్లెట్లు ఆరగించిన వెంటనే చిన్నారులు స్పృహ కోల్పోవడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే, అక్కడ ముగ్గురు తోబుట్టు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. 
 
ఈ దారుణం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఖుషీ నగర్ జిల్లాలో చోటుచేసుకుంది. మృతులను మంజన (3), స్వీటి (3), సమర్ (2), అరుణ్ (5)గా గుర్తించాపు. వీరీలో మంజన, స్వీటి, సమర్‌లు ఒకే తల్లి బిడ్డలు కావడం గమనార్హం. ఖుషీ నగర్‌లో జిల్లా కాశ్య ప్రాంతంలోని దిలీప్ నగర్‌లో ఉన్న ఓ ఇంటి ముందు లభ్యమైన ప్లాస్టిక్ బ్యాగులో ఉన్న చాక్లెట్లను ఓ మహిళ తన ముగ్గురు మనువళ్లు, పక్కింట్లో నివశించే మరో చిన్నారికి ఇవ్వగా వారంతా ప్రాణాలు కోల్పోయారు.