శనివారం, 8 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 3 మే 2017 (17:24 IST)

పారిపోయిన ప్రేమ జంట వివరాలు చెప్పాలని ముస్లింను కొట్టి చంపిన హిందు యువ వాహని కేడర్

పారిపోయిన ప్రేమ జంట వివరాలు చెప్పాలని ఓ ముస్లిం వ్యక్తిని హిందూ యువ వాహిని అనే సంస్థకు చెందిన కార్యకర్తలు దారుణంగా కొట్టి చంపారు. ఈ దారుణం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బులంద్‌షహర్‌లో చోటుచేసుకుంది. ఈ వివ

పారిపోయిన ప్రేమ జంట వివరాలు చెప్పాలని ఓ ముస్లిం వ్యక్తిని హిందూ యువ వాహిని అనే సంస్థకు చెందిన కార్యకర్తలు దారుణంగా కొట్టి చంపారు. ఈ దారుణం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బులంద్‌షహర్‌లో చోటుచేసుకుంది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
గతనెల 27వ తేదీన సోహికి చెందిన యూసఫ్ (19) అనే యువకుడు ఫజల్‌పూర్‌కి చెందిన ఓ హిందూ బాలిక (18)ను ప్రేమించి పెళ్ళి చేసుకునేందుకు ఇంటి నుంచి పారిపోయాడు. ఈ పారిపోయిన ప్రేమ జంట కోసం యువతి బంధువులు చుట్టుపక్కల గ్రామాల్లో గాలించారు. ఎంతకీ ఆచూకీ లభించక పోవడంతో.. యూసఫ్ దూరపు బంధువును మంగళవారం కొందరు వ్యక్తులు అతడిని లాక్కుంటూ ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లారు. 
 
పారిపోయినవారి వివరాలు చెప్పాలని అడిగారు. ఆయన చెప్పలేకపోవడంతో దారుణంగా కొట్టి చంపేశారు. హిందూ యువ వాహిని సభ్యులే ఈ దారుణానికి ఒడిగట్టారని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తుండగా... తమకు ఈ వివాదంతో సంబంధం లేదనీ సంస్థ సభ్యులు చెబుతున్నారు. 
 
గత ప్రభుత్వంతో అనుకూలంగా వ్యవహరించిన కొందరు పోలీసులు తమను కావాలనే ఇందులో ఇరికిస్తున్నారని ఆరోపించారు. కాగా గత నెలలో ఇదే సంస్థకు చెందిన కొందరు వ్యక్తులు మీరట్‌లోని ఓ గృహంపై దాడిచేసి ఇద్దరు దంపతులను తీవ్రంగా వేధించిన సంగతి తెలిసిందే.