మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 4 నవంబరు 2018 (15:55 IST)

ఐసీయూలో చికిత్స పొందుతున్న బాలికపై గ్యాంగ్ రేప్

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. ఐసీయూలో చికిత్స పొందుతున్న ఎనిమిదేళ్ల చిన్నారిపై సామూహిక అత్యాచారం జరిగింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బరేలీ జిల్లాలో చోటుచేసుకుంది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లాలోని ఓ గ్రామంలో బాలిక(8) పాముకాటుకు గురైంది. దీంతో తల్లిదండ్రులు ఆమెను జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ఐసీయూలో ఉంచారు. 
 
ఈ నేపథ్యంలో ఆసుపత్రిలో పనిచేస్తున్న ఓ వ్యక్తి, మరో నలుగురు స్నేహితులతో కలిసి బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించి వెళ్లిపోయారు.
 
మరుసటి రోజు బాలికను వైద్యులు జనరల్ వార్డుకు తరలించారు. ఈ సందర్భంగా తనపై జరిగిన దారుణాన్ని బాధితురాలు తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఐదుగురు నిందితులపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.